ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో పాటు 8 దేశాలు తలపడుతున్నాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ జట్లు హాయ్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం పోటీ పడతాయి. భద్రతా కారణాల వల్ల భారత్ దుబాయ్ వేదికగా మ్యాచ్ లు ఆడనుంది. మిగిలిన మ్యాచ్ లు రావాల్పిండి, కరాచీ, లాహోర్ వేదికలుగా జరుగుతాయి. గ్రూప్ – ఏ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ – బీ లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఇప్పటికే అన్ని జట్లు తమ ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత ఆటగాళ్ల వివరాలను ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది.. ప్రారంభంలో బుమ్రా(Bhumra) ఆడతాడని అందరూ అనుకున్నారు. కానీ అతడికి వెన్ను నొప్పి తగ్గకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడు నూటికి నూరు శాతం సామర్థ్యంతో లేడని బీసీసీఐ స్పష్టం చేసింది.. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా(Harshit Rana) కు అవకాశం లభించింది. బుమ్రా మాత్రమే కాదు యశస్వి జైస్వాల్ (yashasvi Jaiswal) కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. రిజర్వ్ ఆటగాడిగా మాత్రమే అతడు జట్లో ఉంటాడు. మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj), శివం దుబే (Shivam Dube) నాన్ ట్రావెలింగ్ ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు యశస్వి జైస్వాల్ కూడా చేరిపోయాడు… అయితే గాయం లేదా సామర్థ్యం వంటి కారణాలను చూపించకపోయినప్పటికీ.. మైదానాన్ని దృష్టిలో ఉంచుకొని బౌలర్ల ను తీసుకోవడం వల్లే వారు రిజర్వ్ ప్లేయర్లుగా మారిపోయారని తెలుస్తోంది.
వచ్చే ప్రైజ్ మనీ ఇదే
అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ కు కనివిని ఎరుగని స్థాయిలో ప్రైజ్ మనీ పెంచారు. మిగతా వారికి కూడా భారీగానే ముట్ట చెప్పనున్నారు. దీనికి సంబంధించిన జాబితాను ఐసీసీ విడుదల చేసింది. విజేతకు 2.24 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందుతుంది. రన్నరప్ కు 1.12 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. సెమీ ఫైనలిస్టులకు 560,000, గ్రూప్ మ్యాచ్ లలో గెలిచిన జట్టుకు 34,000, పాయింట్లు పట్టికలో ఐదు, ఆరు స్థానాలలో నిలిచిన జట్టుకు 350,000, ఏడు, 8 స్థానాల్లో నిలిచిన జట్టుకు 140,000 డాలర్ల నాగదు బహుమతి లభిస్తుంది.. పార్టిసిపేషన్ ఫీజుగా ఒక్కొక్క జట్టుకు 125,000 డాలర్లు చెల్లిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లో విజేతకు ప్రైజ్ మనీ భారీగా పెంచడంతో.. ఐపీఎల్ ప్రైజ్ మనీ కూడా దిగదుడుపే అని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు..