https://oktelugu.com/

Champions Trophy 2025: పాకిస్తాన్ కు సినిమా అర్థమైంది.. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కీలక నిర్ణయం.. ఆ మోడ్ లో నిర్వహించడానికి సిద్ధం..

పాకిస్తాన్ కు సినిమా అర్థమైంది. చాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇన్నాళ్లు లేనిపోని డాంబికాలకు పోయిన ఆ జట్టు మేనేజ్మెంట్.. కాళ్ల బేరానికి వచ్చింది. మొత్తానికి ఐసీసీ నిర్ణయానికి తల ఊపింది. అంతేకాదు భారత్ ఆడే మ్యాచ్ ల విషయంలో హైబ్రిడ్ విధానానికి ఓకే చెప్పింది. ఫలితంగా భారత్ దుబాయ్ వేదికగా మ్యాచ్ లు ఆడనుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 14, 2024 / 11:44 AM IST

    Champions Trophy 2025

    Follow us on

    Champions Trophy 2025: 2026లో టీమిండియా శ్రీలంక తో కలిసి టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లు శ్రీలంక వేదికగా జరుగుతాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శనివారం అధికారికంగా ప్రకటన వస్తుందని తెలుస్తోంది. దానికంటే ముందే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హైబ్రిడ్ విధానంలో ఈ టోర్నీ నిర్వహించడానికి ఐసిసి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐసీసీ ప్రతిపాదనలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ వేదికగా నిర్వహించడానికి ఐసీసీ ప్రతిపాదన చేయగా.. దానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్టు తెలుస్తోంది.. అందువల్లే వీలైనంత తొందరగా ఛాంపియన్స్ ట్రోఫీ -2025 కు సంబంధించిన వివరాలు మొత్తం ఐసిసి వెల్లడిస్తుందని సమాచారం.

    షెడ్యూల్ ఎప్పుడో రావాల్సి ఉండగా..

    ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ గత నెలలో వెల్లడించాల్సి ఉంది. పాకిస్తాన్, భారత క్రికెట్ బోర్డుల మధ్య వివాదాలు వెలుగు చూడటంతో షెడ్యూల్ ఒకసారిగా నిలిచిపోయింది. భద్రతా కారణాల వల్ల తమ జట్టును పాకిస్తాన్ పంపలేమని భారత్ స్పష్టం చేసింది. తమ జట్టు ఆడే మ్యాచ్ లను ఆసియా కప్ మాదిరిగానే, తటస్థ వేదికపై నిర్వహించాలని బీసీసీఐ కోరుతూ వచ్చింది. ఆటగాళ్ల భద్రత ను ప్రమాదంలో పడేయలేమని భారత క్రికెట్ బోర్డు వివరించింది. ఇక ఇదే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఐసీసీ ఒప్పించడానికి ప్రయత్నించింది. చివరికి బీసీసీఐ రాసిన లేఖలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పంపించింది. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిర్వహించకుండా అడ్డుకుంది. అయితే భారత్ తమ దేశంలో నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేందుకు ఇష్టాన్ని చూపించకపోవడంతో.. తమ కూడా ఐసీసీ భారత్లో నిర్వహించే టోర్నీలలో ఆడబోమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అప్పట్లో దీనికి బీసీసీఐ ఒప్పుకోలేదు. అనేక చర్చల అనంతరం icc తుది నిర్ణయానికి వచ్చింది. 2026 t20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక దేశాలలో జరగనుంది. పాక్ ఆడే మ్యాచ్ లు మొత్తం శ్రీలంకలో జరుగుతది.. అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్ కు సంబంధించి ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ శనివారం భేటీ అవనుంది. దీని తర్వాత టోర్నీ షెడ్యూల్ విడుదలవుతుంది. ఈ టోర్నీ మొత్తం హైబ్రిడ్ విధానంలో (భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రమే) జరిగినప్పటికీ.. ఆతిధ్య హక్కులు మాత్రం పాకిస్తాన్ కే ఉంటాయి. ఇదే విషయాన్ని ఇప్పటికే ఐసీసీ స్పష్టం చేసింది.