Wimbledon : వింబుల్డన్ విజేతలకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారంటే..

ఫైనల్ మ్యాచ్లో గెలవడం ద్వారా అల్క రాస్ కు 50 మిలియన్ ఇంగ్లాండ్ పౌండ్ల ప్రైజ్ మనీ లభించింది. వింబుల్డన్ చరిత్రలో ఇది రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ. అమెరికన్ డాలర్లలో చూసుకుంటే 3,427,396, భారత కరెన్సీ లో చూసుకుంటే రూ. 283,500,000 అతడికి దక్కింది.

Written By: Bhaskar, Updated On : July 17, 2024 6:20 pm
Follow us on

Wimbledon  : ఇంగ్లాండ్ కేంద్రంగా జరిగే వింబుల్డన్ టెన్నిస్ పోటీల్లో.. పురుషుల విభాగంలో అల్క రాస్ విజేతగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్లో జకోవిచ్ ను ఓడించాడు. 25వ గ్రాండ్ స్లామ్ నెగ్గాలని భావించిన జకోవిచ్ కలను అల్క రాస్ భగ్నం చేశాడు.

ఫైనల్ మ్యాచ్లో గెలవడం ద్వారా అల్క రాస్ కు 50 మిలియన్ ఇంగ్లాండ్ పౌండ్ల ప్రైజ్ మనీ లభించింది. వింబుల్డన్ చరిత్రలో ఇది రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ. అమెరికన్ డాలర్లలో చూసుకుంటే 3,427,396, భారత కరెన్సీ లో చూసుకుంటే రూ. 283,500,000 అతడికి దక్కింది.

రన్నరప్ గా నిలిచిన జక్కవిచ్ కు 1,400,000 ఇంగ్లాండ్ పౌండ్ల ప్రైజ్ మనీ దక్కింది. భారత కరెన్సీలో చూసుకుంటే రూ. 147,000,000 గా ఉంటుంది

ఇక మహిళల సింగిల్స్ లో బార్బోరా క్రెజీ కోవా విజేతగా నిలిచింది. ఆమెకు 2,700,000 ఇంగ్లాండ్ పౌండ్ల ప్రైజ్ మనీ లభించింది. భారత కరెన్సీ లో ఇది 282,000,000గా ఉంటుంది.

వింబుల్డన్ పురుషుల డబుల్స్ లో హెన్రీ ప్యాటెన్, హ్యారీ హెలియోవారా టైటిల్ దక్కించుకున్నారు. వీరికి 650,000 పౌండ్ల ప్రైజ్ మనీ లభించింది. హెన్రీ ప్యాటెన్, హ్యారీ హెలియోవారా వింబుల్డన్ టోర్నీకి మూడు నెలల ముందు జతకట్టారు. పైగా వీరు అన్ సీడెడ్ ఆటగాళ్లు.

మహిళల డబుల్స్ లో టేలర్ టౌన్ సెండ్, కాటేరేనా సీనియాకోవా విజేతలుగా నిలిచారు. వీరు 650,000 పౌండ్లు ప్రైజ్ మనీగా సాధించారు. ఇక మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో హీహ్ – సు – వీ, జాన్ జిలిన్స్ విజేతలుగా నిలిచారు. వీరికి 130,000 పౌండ్ల ప్రైజ్ మనీ దక్కింది.