Ambati Rayudu: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. చివరి మ్యాచ్ ఐపీఎల్ – 2023 ఫైనల్ ఆడాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ కేరీర్‌కు ముగింపు పలికాడు. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాయుడు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 204 మ్యాచ్‌లు ఆడి 28.29 సగటుతో 4,348 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే.. రాయుడు ఆరు ఐపీఎల్ టైటిళ్లలో భాగస్వామి కావడం మరో రికార్డు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని హిస్టరీ రాయుడి ఖాతాలో ఉంది.
ముంబైతో అరంగేట్రం..
2010–2017 వరకు ముంబై ఇండియన్స్‌కు రాయుడు ప్రాతినిధ్యం వహించాడు. నిలకడగా ఆడుతూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. 2018లో ముంబై రాయుడును వదులుకోవడంతో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2023 ఐపీల్ వరకు చెన్నై జట్టులోనే కొనసాగాడు.
ఆరు టైటిళ్లలో భాగస్వామి..
రాయుడు తన ఐపీఎల్ కేరీర్‌లో ఆరు టైటిళ్లు గెలిచిన టీంలో భాగస్వామిగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున (2013, 2015, 2017).. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున (2018, 2021, 2023)లో టైటిల్‌ను అందుకున్నాడు. 2018లో సీఎస్కే ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంలో రాయుడిదే కీలకపాత్ర. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 43 సగటుతో 602 పరుగులు సాధించాడు. అదే సీజన్‌లో ఐపీఎల్‌లో సాధించిన ఏకైక సెంచరీ కూడా నమోదు చేశాడు.
రాయుడు రికార్డులివి
పవర్ హిట్టర్ అయిన రాయుడుకు ఐపీఎల్‌లో గొప్ప రికార్డు ఉంది. 204 మ్యాచ్‌లు ఆడి 28.29 సగటుతో 4,348 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, 22 అర్ధ శతకాలు ఉన్నాయి. స¯Œ రైజర్స్ హైదరాబాద్‌పై అతడు 69 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అంతేకాదు 37 కంటే ఎక్కువసార్లు రాయుడు 30 ప్లస్ స్కోర్ చేశాడు.
ముంబైతో ఏడేళ్లు..
ముంబై ఇండియన్స్‌తో రాయుడు కెరీర్ మొదలైంది. 2010లో ముంబై తరఫున అతడు ఆరంగ్రేటం చేశాడు. 2010 నుంచి 2017.. ఏడేళ్లు ఆ ఫ్రాంచైజీతోనే కొనసాగాడు. కుడి చేతివాటం బ్యాటర్ అయిన అతడు 2013లో అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది ముంబై ట్రోఫీ నెగ్గడంలో రాయుడు పాత్ర ఉంది. ఆ తర్వాత 2018లో చెన్నై జట్టులోకి వచ్చాడు. 2021లో సీఎస్కే మళ్లీ అతడిని రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. చివరి మ్యాచ్‌లో కూడా విజయంతోపాటు, టైటిల్ గెలవడం రాయుడికి దక్కిన గౌరవంగా చెప్పొచ్చు.