IPL 2024: ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ ఇంత ఇంత కాదు ఇక ఇదే క్రమంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఐపిఎల్ లో ఆడాలని చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అందుకే ప్రపంచంలో ఏ లీగ్ కి లేనంత క్రేజ్ ఐపీఎల్ కు మాత్రమే సాధ్యం అయింది. ఇక ఒక్కసారి ఐపీఎల్లో ఆడితే ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్లేయర్లు చాలా బాగా ఫేమస్ అవుతారు చాలామంది ఫారన్ ప్లేయర్స్ కూడా అలా ముందు ఐపీఎల్ లో ఆడి మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ల దేశానికి సెలెక్ట్ అయి అక్కడ కూడా రాణిస్తూ వస్తున్నారు…
ఇక దానికోసమే ఇప్పుడు ఐపీఎల్ వేలంలో 1166 మంది దాకా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లు అందరూ కూడా ఈసారి ఐపిఎల్ వేలానికి వస్తున్నారు…ఇక ఐపిఎల్ లో మొత్తం టీమ్ లకి కలిపి 77 మంది ప్లేయర్లు మాత్రమే అవసరం ఉండగా, ఇప్పుడు మాత్రం 1166 మంది ప్లేయర్లు వేలం కోసం పోటి పడుతూ ఉండటం నిజంగా ఆశ్చర్యాన్ని కల్గిస్తున్న విషయం అనే చెప్పాలి…ఇక అందులో కేవలం 30 మాత్రమే విదేశీ క్రికెటర్ల స్థానాలు ఉన్నాయి. ఇక ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లు అందరూ వేలంలో పాల్గొంటున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా టీమ్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్, స్టార్క్ లాంటి వాళ్ళు కూడా వేలంలో పాల్గొంటూ వాళ్ళ కనీస ధర రూ. 2 కోట్లుగా పేర్కొన్నారు…
ఇక వీళ్ళతో పాటుగా వన్డే వరల్డ్ కప్ లో మంచి గుర్తింపు పొందిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ అయిన రచిన్ రవీంద్ర కూడా ఈ లిస్టులో ఉన్నాడు. నిజానికి రచిన్ రవీంద్ర వన్డే వరల్డ్ కప్ లో తనదైన రీతిలో సత్తా చాటుతూ అద్భుతమైన ప్రదర్శనని కనబరిచాడు. దాంతో ఆయన ఈసారి ఐపిఎల్ లో పాల్గొంటున్నాడు…ఈయన ని తీసుకోవడానికి అన్ని టీమ్ లు కూడా పోటీ పడతాయి.
ఇక వీళ్లతో పాటుగా ఇంకా చాలా మంది ప్లేయర్లు ఈసారి ఐపీఎల్ లో పాల్గొన బోతున్నారు. అయితే ఏ టీమ్ ఎవరిని తీసుకుంటుంది అనేది తెలియాలంటే వేలం జరిగేంత వరకు వేచి చూడాల్సిందే. ఈనెల 19 వ తేదీన దుబాయ్ వేదిక గా మినీ వేలం జరగనుంది…ఇక ఈ వేలం లో ప్రతి టీమ్ యాజమాన్యం కూడా చాలా తక్కువ లో మంచి స్కిల్ ఉన్న ప్లేయర్లను తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి…