https://oktelugu.com/

IPL Winner Gujarat Titans : ఐపీఎల్ విజేతగా గుజరాత్ టైటాన్స్ ఎలా నిలిచింది? అసలు కారణాలేంటి?

IPL Winner Gujarat Titans : ఐపీఎల్ విజేతగా కొత్తగా ఈ సీజన్ లోనే వచ్చిన గుజరాత్ టైటాన్స్ గెలవడం సంచలనమైంది. మొదటి సారి టోర్నీలో అడుగుపెట్టి దిగ్గజ టీంలను మట్టికరిపించి కప్పు ఒడిసిపట్టిన తీరు అద్భుతమనే చెప్పాలి. అస్సలు ఏ స్టార్ ప్లేయర్ లేని ఈ జట్టు కప్ కొడుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ జట్టు గెలుపునకు 100శాతం కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కృషి, పట్టుదల ఉంది. ఔట్ డేటెడ్.. అనామకులైన ఆటగాళ్లను ఎంపిక చేసుకొని […]

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2022 / 08:31 AM IST
    Follow us on

    IPL Winner Gujarat Titans : ఐపీఎల్ విజేతగా కొత్తగా ఈ సీజన్ లోనే వచ్చిన గుజరాత్ టైటాన్స్ గెలవడం సంచలనమైంది. మొదటి సారి టోర్నీలో అడుగుపెట్టి దిగ్గజ టీంలను మట్టికరిపించి కప్పు ఒడిసిపట్టిన తీరు అద్భుతమనే చెప్పాలి. అస్సలు ఏ స్టార్ ప్లేయర్ లేని ఈ జట్టు కప్ కొడుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ జట్టు గెలుపునకు 100శాతం కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కృషి, పట్టుదల ఉంది. ఔట్ డేటెడ్.. అనామకులైన ఆటగాళ్లను ఎంపిక చేసుకొని వారితో కసిగా ఆడించి ఫలితాలు రాబట్టిన తీరు గ్రేట్ అనే చెప్పాలి.

    ఐపీఎల్ 2022లో హార్థిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఒకప్పటి ధోనిని గుర్తు చేశాడు. ఆయన నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ కప్ కొట్టడం విశేషం. దీంతో హార్థిక్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. హార్ధిక్ వైఫల్యాల నుంచి గెలుపు బాట పట్టించాడు. అతడి బ్యాటింగ్ విధానాన్ని చూస్తే కెప్టెన్ గా సమర్థవంతంగా పనిచేస్తున్నాడని చెప్పకతప్పదు. మ్యాచ్ ఎంత టెన్షన్ గా ఉన్న కూల్ గా ఆటాడుతున్నాడు. ఒక కెప్టెన్ కి ఉన్న లక్షణాలు హార్థిక్ పాండ్యాలో కనిపిస్తున్నాయి. . గుజరాత్ టైటాన్స్ విషయంలో కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

    ఐపీఎల్ లో గత సీజన్ లో రాణించకపోవడంతో పంజాబ్ కింగ్స్ డేవిడ్ మిల్లర్ ను వదులుకుంది. వేలంలో అతడిని ఏ జట్టు కొనలేదు. కానీ చివరకు గుజరాత్ టైటాన్స్ మిల్లర్ ను తక్కువ రేటుకే కొనుగోలు చేసింది. ఇక వృద్ధిమాన్ సాహాను హైదరాబాద్ వదిలేస్తే ఏ టీం కొనలేదు. ఇతడిని కొన్న గుజరాత్ అతడితో అద్భుతమైన బ్యాటింగ్ చేయించింది. ఈ ఇద్దరు ఔట్ డేటెడ్ ఆటగాళ్లు ఐపీఎల్ లో గుజరాత్ ను ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

    ఇక నడిపించే నాయకుడు ముందుండాలి. ఆ విషయంలో కెప్టెన్ గా హార్ధిక్ సక్సెస్ అయ్యాడు. ఐపీఎల్ ఫైనల్ లో 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు తీసి మ్యాచ్ విన్నింగ్ పర్ ఫామెన్స్ ఇచ్చాడు. అనంతరం బ్యాటింగ్ లోనూ కీలకమైన 34 పరుగులు చేసి గుజరాత్ కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు.

    కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంలో.. వారి ప్రతిభను గుర్తించి జట్టులోకి తీసుకోవడంలో.. కెప్టెన్ గా జట్టును ముందుండి నడపడంలో హార్ధిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. అదే గుజరాత్ ను ఐపీఎల్ కప్ కొట్టేలా చేసింది. అనామకులైన ఆటగాళ్లతో అద్భుతాలు సాధించిన హార్ధిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ ఈ విజయానికి అర్హులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఇక హార్ధిక్ పాండ్య తొలిసారి కెప్టెన్ గా ఎంపికై సత్తా చాటడంతో భవిష్యత్ భారత కెప్టెన్ అతడేనని అందరూ అంచనావేస్తున్నారు. ధోని తర్వాత ఇలా గెలిపించిన కెప్టెన్ ప్రస్తుతం ఎవరూ లేరు. రోహిత్ శర్మకు వయసు మీదపడడంతో యువకుడైన హార్ధిక్ ను భవిష్యత్ కెప్టెన్ చేయాలని అందరూ డిమాండ్ మొదలుపెట్టారు.

    ప్రస్తుతం టీమిండియాలో యువకులైన కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. అయితే కేఎల్ రాహుల్ ఆటగాడిగా క్లిక్ అయిన కెప్టెన్సీలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇక పంత్ ఐపీఎల్ లో పేలవమైన వ్యూహాలతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు చేరకుండా నిరాశపరిచాడు. శ్రేయాస్ అయ్యర్ లో కెప్టెన్సీ లక్షణాలున్నా అతడు ఆటగాడిగా సరిగ్గా రాణించలేకపోతున్నాడు. ఓవరాల్ గా ఇటు బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి టీంను ఫైనల్ వరకూ తెచ్చిన హార్ధిక్ పాండ్యానే ఇప్పుడు టీమిండియాకు ఏకైక ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు.