https://oktelugu.com/

MS Dhoni leadership : ఎంఎస్ ధోనీ పట్టిందల్లా బంగారం ఎందుకు అవుతోంది?

14 సీజన్లలో 10 సార్లు ఫైనల్స్ కు చేరుకోవడం అద్భుతం. ఇది గొప్ప అచీవ్ మెంట్. ఎంఎస్ ధోని సునాయాసంగా జట్టును నడిపించాడు. ధోని కోసం ఎలాగైనా టైటిల్ ను నెగ్గాలని భావిస్తున్నట్లు

Written By:
  • NARESH
  • , Updated On : May 24, 2023 / 10:29 PM IST
    Follow us on

    MS Dhoni leadership : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటరే కాదు.. జట్టును అగ్ర పథాన నడిపించే గొప్ప నాయకుడు కూడా. అంతకు మించి అదృష్టవంతుడు మహేంద్రసింగ్ ధోని. ఈ విషయాన్ని మీరో.. నేనో చెబుతున్న విషయం కాదు. కొన్నేళ్లపాటు ధోనితో సాన్నిహిత్యంగా మెలిగిన ఎంతో మంది చెబుతున్న మాట. ఈ విషయాన్ని మరోసారి ధ్రువీకరిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

    ఇండియన్ క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్ లను దేశానికి అందించి పెట్టాడు ధోని. వీటితోపాటు అనేక దేశాల్లో గొప్ప గొప్ప విజయాలను జట్టుకు అందించాడు. జట్టు అద్భుతమైన ప్రదర్శన చేయడంతోపాటు ధోని లక్కీ హ్యాండ్ కూడా కలిసి వస్తోందనేది ప్రతి ఒక్కరి నమ్మకం. ధోనితో కలిసి ఆడిన ఎంతోమంది ఇదే విషయాన్ని చెబుతుంటారు. తాజాగా పలువురు క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

    ఐపీఎల్ చెన్నై జట్టు విజయాల వెనుక మహేంద్రసింగ్ ధోని..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోను చెన్నై జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఈ జట్టు.. తొమ్మిది సార్లు ఫైనల్ కి వెళ్ళగా.. ఈ ఏడాది కూడా ఫైనల్ కు దూసుకెళ్లింది. క్వాలిఫైయర్ లో విజేతగా నిలిచే జట్టుతో టైటిల్ కోసం చెన్నై జట్టు తలపడనుంది. కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ లో చెన్నై జట్టు అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఛాంపియన్ ఆట తీరుతో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది చెన్నై జట్టు. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై జట్టు.. ఒకానొక దశలో ప్లే ఆఫ్ చేరడమే కష్టంగా అనిపించింది. ఈ తరుణంలో అద్భుతమైన విజయాలతో ప్లే ఆఫ్ కు చేరడమే కాకుండా.. ఏకంగా గతేడాది ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ జట్టును ప్లే ఆఫ్ లో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. చెన్నై జట్టు ఫైనల్ చేరడంతో మాజీ ఆటగాళ్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ధోని ఒకప్పటి సహచరుడు, టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ధోనీ సేనను అభినందించారు.

    ధోని వల్లే విజయం సాధ్యం : వీరేంద్ర సెహ్వాగ్

    ” చెన్నై సూపర్ కింగ్స్ ను అద్భుతంగా నడిపించడంలో ధోనీకి మరెవరు సాటిరారు. కేవలం ధోని మాత్రమే సీఎస్కే ఫైనల్స్ కు చేర్చగల సమర్థుడు. అందుకే చెన్నై ని గొప్ప జట్టుగా అభివర్ణించా. సీఎస్కే అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు రావడానికి కూడా కారణం ధోని నాయకత్వం” అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

    ధోని నాయకత్వంలో గొప్ప అచీవ్ మెంట్ : సురేష్ రైనా

    ”14 సీజన్లలో 10 సార్లు ఫైనల్స్ కు చేరుకోవడం అద్భుతం. ఇది గొప్ప అచీవ్ మెంట్. ఎంఎస్ ధోని సునాయాసంగా జట్టును నడిపించాడు. ధోని కోసం ఎలాగైనా టైటిల్ ను నెగ్గాలని భావిస్తున్నట్లు రుతురాజ్ గైక్వాడ్ నాతో చెప్పాడు. దేశం మొత్తం కూడా ధోని మళ్లీ ఐపీఎల్ టైటిల్ గెలవాలని ఎదురుచూస్తోంది. ఎంఎస్ ధోని ఏది తాకినా అది బంగారం అయిపోతుంది. చెపాక్ లో సిఎస్కెను అడ్డుకోవడం చాలా కష్టం. ప్రత్యర్ధులు చాలా శ్రమించాల్సి ఉంటుంది ” అని రైనా వ్యాఖ్యానించాడు.

    చెపాక్ లో ధోని కిదే చివరిది కాదు : ఇర్ఫాన్ పఠాన్

    ఇకపోతే చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి టీమ్ ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని మరికొన్నేళ్లు తప్పకుండా ఆడతాడనే అర్థంలో ట్వీట్ పెట్టాడు. ”ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండటం వల్ల.. ధోనికి ఇది చెపాక్ లో చివరి మ్యాచ్ కాదనే ఆశాభావంతో ఉన్నా” అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.