World Cup 2023 : వైజాగ్ బీచ్ లో బట్టలు లేకుండా పరిగెత్తుతా : హీరోయిన్ రేఖా భోజ్

నాకు ఇండియన్ టీమ్ అంటే ప్రాణం అందుకే ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిస్తే నేను న్యూడ్ గా బీచ్ లో తిరుగుతాను అంటూ వాళ్ళకి రీప్లే ఇచ్చింది ...

Written By: Gopi, Updated On : November 16, 2023 10:20 am
Follow us on

World Cup 2023 – Rekha Bhoj : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీమ్ లీగ్ దశ లో వరుస విజయాలను అందుకుంటూ తమదైన రీతిలో ఇప్పటికే 9 విజయాలను సొంతం చేసుకుని ఈ టోర్నీలో అత్యధిక విజయాలను సాధించిన టీమ్ గా గుర్తింపు పొందింది. ఇక అందులో భాగంగా న్యూజీలాండ్ మీద ఇండియన్ టీమ్ ఇవాళ్ళ ఆడుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసి 397 పరుగుల భారీ స్కోర్ చేసి న్యూజిలాండ్ టీం ముందు ఒక భారీ లక్ష్యాన్ని పెట్టింది.

ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం వరల్డ్ కప్ గెలవాలని ఇండియాలోని ప్రతి క్రికెట్ అభిమాని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అయితే కొంతమంది మాత్రం వరల్డ్ కప్ లో ప్రేక్షకుల యొక్క అటెన్షన్ ని క్యాష్ చేసుకోవడానికి వివిధ రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న రేఖా భోజ్ మాత్రం కొన్ని అసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది… టీమిండియా వరల్డ్ కప్ లో విజయం సాధిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. స్ట్రీకింగ్ అంటే వెస్ట్రన్ దేశాల్లో బీచ్ లో బట్టలు విప్పి ఆనందంతో పరిగెత్తడం ఇక ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే తను న్యూడ్ గా వైజాగ్ బీచ్ లో పరిగెడతా అంటూ రేఖా భోజ్ చేసిన కామెంట్లను చూసిన చాలా మంది నెటిజన్స్ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు…

ఇక ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నిజానికి చాలా మంది ఇలాంటి ఒక పీక్ సిచువేశన్ ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఫేమస్ అవుదాం అని చూస్తుంటారు అందుకే ఇలా బోల్డ్ వ్యాఖ్యలు చేస్తారు అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే ఆమె మాత్రం కొన్ని కామెంట్లకు రీప్లే ఇస్తు నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు, నేను ఫేమస్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు ఇండియన్ టీమ్ అంటే ప్రాణం అందుకే ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిస్తే నేను న్యూడ్ గా బీచ్ లో తిరుగుతాను అంటూ వాళ్ళకి రీప్లే ఇచ్చింది …

ఇక ఇదంతా చూసిన మరి కొంత మంది మాత్రం ఇండియా మీద అభిమానం చూపించడానికి న్యూడ్ గా తిరగడం దేనికి ఇండియా లో చాలా మంది అనాధ పిల్లలు ఉన్నారు.మీకు దగ్గరలో ఉన్న అనాధలకు ఏదో ఒక సాయం చేయండి అది గొప్ప పని అవుతుంది అంతే తప్ప బట్టలు విప్పుకొని తిరగడం ఎందుకు అది మన సంస్కృతి కాదు అని అంటున్నారు…