https://oktelugu.com/

Harsha Bhogle Tweet On Hyderabad: ఎంత ఎదిగినా తెలుగుపై మమకారం చాటుకున్న హర్ష భోగ్లే

Harsha Bhogle Tweet On Hyderabad: హర్షా భోగ్లే పేరు తెలియని వారు ఉండరు. మరాఠీ కుటుంబానికి చెందిన ఆయన హైదరాబాద్ లోనే జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యనభ్యసించాడు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీజీ చేశారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. క్రికెట్ కామెంటేటర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. క్రికెట్లో కామెంట్రీ చేయడంలో దిట్ట. తనదైన శైలిలో ఆటల గురించి వివరణ ఇవ్వడంలో దిట్ట. క్రికెటర్ కాకపోయినా ఆట గురించి కామెంట్రీ చేస్తూ ఉపాధి […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 23, 2022 / 05:24 PM IST
    Follow us on

    Harsha Bhogle Tweet On Hyderabad: హర్షా భోగ్లే పేరు తెలియని వారు ఉండరు. మరాఠీ కుటుంబానికి చెందిన ఆయన హైదరాబాద్ లోనే జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యనభ్యసించాడు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీజీ చేశారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. క్రికెట్ కామెంటేటర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. క్రికెట్లో కామెంట్రీ చేయడంలో దిట్ట. తనదైన శైలిలో ఆటల గురించి వివరణ ఇవ్వడంలో దిట్ట. క్రికెటర్ కాకపోయినా ఆట గురించి కామెంట్రీ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. నగరం గురించి పూర్తి అవగాహన ఉండటంతో అప్పుడప్పుడు తెలుగు పదాలు వాడటం కూడా ఆయనకు అలవాటే.

    Harsha Bhogle

    ఇటీవల హైదరాబాద్ గురించి ఆయన చేసిన కామెంట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ చాలా మారిపోయిందని చెబుతున్నాడు. దీంతో నెటిజన్లు కూడా స్పందించారు. ఆయన కామెంట్ కు మద్దతు తెలిపారు. ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారిపోతోంది. దినదినం ఎంతో మార్పు చెందుతోంది. దీంతో హర్షా భోగ్లే చేసిన కామెంట్ తో నగరవాసులు కూడా గొంతు కలిపారు. నగరం గురించి ఆయన చెప్పిన మాటలకు ఔననే వారు కూడా బదులిచ్చారు. ఇటీవల ఓ తెలుగు సీరియల్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గురించి తనదైన రీతిలో కామెంట్ చేయడం సంచలనంగా మారింది.

    Also Read: Arjun Mother Passed Away: ప్రముఖ హీరో అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం..శోకసంద్రం లో టాలీవుడ్

    గత మార్చిలో ఓ క్రికెట్ కు కామెంట్రీ ఇస్తుండగా అకస్మాత్తుగా హర్షా భోగ్లేను ఎవరో కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆయన మాట్లాడుతుండగానే ఎవరో వచ్చి ఆయనను ఎత్తుకెళ్లినట్లు క్రియేట్ చేశారు. దీంతో అందరు ఆయనను ఎవరో ఎత్తుకెళ్లారనే అనుమానించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరువాత ఆయన తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని తాను క్షేమంగానే ఉన్నానని బదులిస్తూ చెప్పడం సంచలనం సృష్టించింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. కానీ చివరకు అంతా వట్టిదేనని తేలిపోవడంతో అందరు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

    Harsha Bhogle

    హైదరాబాద్ గురించి హర్షా భోగ్లే తెలుగులో ట్వీట్ చేయడంతో నెటిజన్లు కూడా సమాధానాలు ఇచ్చారు. నగరం ఎంతో మారిపోయిందని భోగ్లే చేసిన ట్వీట్ కు అందరు కూడా నగరం రూపురేఖలు మారాయని చెప్పారు. గతం కంటే ఇప్పడు నగరం చాలా మారిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఆయన చదువుకున్న కాలానికి ఇప్పటికి హైదరాబాద్ ఎన్నో మార్పులకు గురైంది. దీంతో నగరం గురించి ఆయన తనదైన శైలిలో భాగ్యనగరం రూపురేఖలు అభివర్ణించడం గమనార్హం. మొత్తానికి నగరంతో సంబంధం ఉండటంతోనే ఆయన ఇలా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

    Also Read:Dhanush: రామ్ చరణ్ మరియు ప్రభాస్ లు నాలాగా మోసపోకూడదని కోరుకుంటున్నాను: ధనుష్

    Tags