Harmanpreet Kaur ODI Records: ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత పురుషులు ఇబ్బంది పడుతున్న వేళ.. అమ్మాయిలు మాత్రం అదరగొట్టారు. ఆతిధ్య ఇంగ్లీష్ జట్టుపై 3 వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుని సంచలనం సృష్టించారు.. హర్మన్ ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలోని భారత మహిళల జట్టు ఆతిధ్య ఇంగ్లీష్ జట్టుపై అదరగొట్టింది.. ఇప్పటికే t20 సిరీస్ ను సొంతం చేసుకున్న హర్మన్ సేన వన్డే సిరీస్ లోనూ అదే మ్యాజిక్ కొనసాగించింది. మూడవ వన్డేలో ఏకంగా 13 పరుగులు తేడాతో విజయం సాధించి చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుంది.. కెప్టెన్ కౌర్ సెంచరీ చేయగా.. క్రాంతి గౌడ్ ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది.
Also Read: భారత్ భయపడుతోందట..ఈ ఇంగ్లీష్ ఆటగాడికి కాస్త భయాన్ని పరిచయం చేయండయ్యా!
నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టీమిండియా ఏకంగా 318 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించడంలో ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడినప్పటికీ 305 పరుగుల వద్ద పోరాటాన్ని ముగించాల్సి వచ్చింది. క్రాంతి గౌడ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ విజయం ముందు బోల్తా పడింది. ఇంగ్లాండ్ ప్లేయర్లలో ఫీవర్ 98 పరుగులు చేసి గొప్పగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా టీమ్ ఇండియా ప్లేయర్లు అద్భుతాలు సృష్టించారు. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండవ ఇండియన్ ప్లేయర్గా రికార్డు సృష్టించింది. ఆమె 82 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. భారత మహిళలు తరఫున వన్డేలలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఘనత స్మృతి పేరు మీద ఉంది. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆమె 70 బంతులు ఎదుర్కొని శతకాన్ని సాధించింది. ఇక ఈ సెంచరీ ద్వారా టీమిండియా కెప్టెన్ హర్మన్ ఇంగ్లాండ్ గడ్డమీద వన్డేలలో మూడు సెంచరీలు చేసిన పర్యాటక జట్టు క్రికెటర్ అయ్యారు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా లెజెండరీ ప్లేయర్ మిథాలీ రాజ్, మెక్ లానింగ్ పేరు మీద ఉండేది. వీరిద్దరూ ఇంగ్లీష్ గడ్డమీద చెరి రెండు సెంచరీలు చేశారు. మూడు సెంచరీలు మాత్రమే కాకుండా హర్మన్ వన్డేలలో 4000 పరుగుల మైలురాయిని పూర్తిచేసుకుంది. ఈ ఘనత అందుకున్న మూడవ భారతీయ ప్లేయర్ గా అమెరికా సృష్టించారు. ఆమె ఏకంగా 4069 పరుగులు చేసింది. వన్డేలలో భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మిథాలీ రాజ్ మొదటి స్థానంలో ఉంది. ఆమె ఏకంగా 7805 పరుగులు చేసింది. ఆ తర్వాత స్మృతి 4588 పరుగులతో రెండవ స్థానంలో ఉంది.
Also Read: బద్దలవ్వడానికి 5 రికార్డులు సిద్ధం.. మాంచెస్టర్ లో టీమిండియా అద్భుతం చేస్తుందా?
త్వరలో భారత్ – శ్రీలంక వేదికగా మహిళల వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ తిరుగులేని ఫామ్ లో ఉండడం జట్టుపై అంచనాలను పెంచుతోంది. ఇదే తీరుగా ఆమె బ్యాటింగ్ చేస్తే టీమిండియా కు తిరిగి ఉండదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెకు మిగతా ప్లేయర్లు గనుక తోడైతే భారత్ వన్డే వరల్డ్ కప్ అనుకోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. మరి ఈ అంచనాలను టీమిండియా కెప్టెన్ ఎంతవరకు నిజం చేస్తారో చూడాల్సి ఉంది.