Homeక్రీడలుక్రికెట్‌India Women vs South Africa Women: హర్మన్ సేన మరోసారి పోరాడాలి.. వన్డే వరల్డ్...

India Women vs South Africa Women: హర్మన్ సేన మరోసారి పోరాడాలి.. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకు తెచ్చుకోవాలి..

India Women vs South Africa Women: టి20 వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు దూసుకుపోతోంది. వరుస విజయాలతో ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. అదే ఊపులో నెదర్లాండ్ పై కూడా బ్రహ్మాండమైన గెలుపును దక్కించుకుంది. ఫలితంగా రెండు విజయాలతో పటిష్ట స్థితిలో ఉంది. టీమిండియా ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ వెళ్లాలంటే.. కప్ మీద ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే సౌత్ ఆఫ్రికా గండాన్ని దాటాలి.

సౌత్ ఆఫ్రికా తో టీమ్ ఇండియా నేడు కీలకమైన మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ హోరాహోరిగా సాగే అవకాశం ఉంది. రెండు జట్లలో కూడా అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. బౌలింగ్.. బ్యాటింగ్ తో అదరగొట్టే సత్తా వీరి సొంతం. ఈ నేపథ్యంలో రెండు జట్లు కూడా గెలుపు కోసం తీవ్రంగా పోరాడే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ చెట్టును రెండు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చూపించింది.. దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ లారా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అదరగొడితే.. టీమిండియా కు ఇబ్బంది తప్పదు.

ఈ మ్యాచ్ మాన్ చెస్టర్ వేదికగా జరుగుతుంది. స్పిన్ బౌలర్లకు ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ.. మిగతా స్పిన్నర్లు గనుక సత్తా చూపిస్తే భారత్ మ్యాచ్ లో అనుకూల ఫలితం సాధించే అవకాశం ఉంది.. అయితే ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత ప్లేయర్లు సమిష్టిగా ఆడుతున్నారు. ఫలితంగా సానుకూల ఫలితాలు వస్తున్నాయి. కేవలం ఒక ప్లేయర్ మీదనే.. ఒక్క బౌలర్ మీదనే జట్టు ఆధారపడడం లేదు. దక్షిణాఫ్రికా జట్టుతో మ్యాచ్ అనగానే టీమ్ ఇండియాకు ఒత్తిడి సహజంగానే ఉంటుంది. దానిని టీమిండియా ప్లేయర్లు అధిగమించాలి.

అన్నింటికటే ముఖ్యంగా ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ మాదిరిగా ఆడాలి. అందరూ విజయమే లక్ష్యంగా ఆడితే టీమిండియాకు తిరుగుండదని మాజీ ప్లేయర్లు పేర్కొంటున్నారు.. చూడాలి మరి హర్మన్ సేన ఏం చేస్తుందో. మందాన, జెమీమా, షఫాలీ వర్మ వంటివారు మెరుగైన ఇన్నింగ్స్ ఆడితే టీమిండియాకు తిరుగుండదు. ఒకవేళ ముందుగా బ్యాటింగ్ గనక చేస్తే టీమిండియా భారీగా పరుగులు చేయాల్సి ఉంటుంది. బౌలింగ్ లోనూ సత్తా చూపించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో అరుంధతి రెడ్డికి విశ్రాంతి వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version