Hardik Pandya Natasha: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా కు పేరు ఉంది. టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి.. భారత్ విజేతగా నిలవడంలో హార్దిక్ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ లో విఫలమైనప్పటికీ.. అంతకుముందు జరిగిన వన్డే వరల్డ్ కప్ లో గాయం వల్ల మధ్యలోనే జట్టును వీడినప్పటికీ.. టి20 వరల్డ్ కప్ లో మాత్రం హార్థిక్ పాండ్యా సత్తా చాటాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి అటు బంతి, ఇటు బ్యాట్ తో ఆకట్టుకున్నాడు. స్టార్ ఆల్ రౌండర్ అనే పదానికి సార్ధకత చేకూర్చాడు. టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో ఆటగాళ్ల విభాగంలో మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఆటపరంగా హార్దిక్ పాండ్యాకు ఇబ్బంది లేకపోయినప్పటికీ.. అతని వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.
ఐపీఎల్ లో విమర్శలు
ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. గుజరాత్ జట్టు నుంచి ముంబై జట్టు కెప్టెన్ గా రిటైన్ అయ్యాడు. కెప్టెన్ గా ముంబై జట్టును సరైన మార్గంలో నడిపించలేకపోయాడు. తన భార్యతో విభేదాలు తెరపైకి రావడంతో వార్తల్లో వ్యక్తయ్యాడు. సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యాడు. పదేపదే అభిమానులు ట్రోల్ చేయడంతో హార్దిక్ తల ఎత్తుకోలేకపోయాడు. ముఖ్యంగా ముంబై ఆడే మ్యాచ్లలో మైదానంలోకి ప్రవేశించిన అభిమానులు హార్దిక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసింది. మరోవైపు అత్యంత చెత్త ప్రదర్శనతో ముంబై జట్టు ఐపిఎల్ నుంచి నిష్క్రమించింది. దీంతో హార్దిక్ పాండ్యా బయటి ప్రపంచానికి కనిపించడం మానేశాడు. ఈ లోగానే అతడు తన భార్యతో విడాకులు తీసుకున్నాడని.. భరణం కూడా సెటిలైందని వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే హార్దిక్ లండన్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత అట్నుంచి అటే అమెరికా వెళ్లి టి20 వరల్డ్ కప్ ఇండియా జట్టులో జాయిన్ అయ్యాడు. టి20 వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేయడంతో హార్దిక్ పాండ్యాకు సోషల్ మీడియాలో కాస్త సానుభూతి లభించింది.
కొడుకుతోనే వేడుకలు జరుపుకున్నాడు
టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. హార్దిక్ ఇండియా వచ్చిన అనంతరం.. విక్టరీ సంబరాలలో జట్టుతో కలిసి కనిపించాడు. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ విజయాన్ని తన కుమారుడితో కలిసి జరుపుకున్నాడు. ఈ లోగానే ఓ యువతి హార్దిక్ పాండ్యాతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అంతకుముందు నటాషా ఒక వ్యక్తితో కలిసి జిమ్ లో కనిపించింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వాదనకు బలం చేకూరింది. ఆ తర్వాత కొద్ది రోజులకి హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా తాను, నటాషా విడిపోయామని ప్రకటించాడు. ఆ మరుసటి రోజు నటాషా తన కుమారుడితో కలిసి స్వాదేశానికి వెళ్ళిపోయింది.
నటాషా చెప్పకనే చెప్పింది
అయితే వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయంపై ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు. నిన్నటి వరకు అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఆ మిస్టరీ వీడింది. హార్దిక్ – నటాషా విడాకులు తీసుకోవడానికి కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది.. నటాషా హార్దిక్ విడాకులు ఇచ్చిన తర్వాత తన వ్యవహార శైలి పూర్తిగా మార్చుకుంది.. ఇన్ స్టా గ్రామ్ లో చీటింగ్, దుర్భాషలాడటం వంటి రీల్స్ కు నటాషా లైక్స్ కొడుతోంది. గతంలో ఈ తరహా రీల్స్ కు నటాషా పెద్దగా స్పందించేది కాదు. పాండ్యాతో విడిపోయిన తర్వాత చీటింగ్ సంబంధిత రీల్స్ కు నటాషా లైక్స్ కొట్టడం చర్చకు దారి తీస్తోంది.. నటాషాను పాండ్యా మోసం చేశాడు కాబట్టే.. వారి దాంపత్య జీవితం ముగిసిపోయిందని, ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పలేక.. పరోక్షంగా చీటింగ్ సంబంధిత రీల్స్ కు నటాషా లైక్స్ కొట్టి.. లీకులు ఇస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సమయంలోనే పాండ్యా – నటాషా విడిపోయారని జోరుగా ప్రచారం సాగింది. అది ప్రచారం మాత్రమే కాదని, నూటికి నూరు శాతం నిజమని స్పష్టం చేస్తూ జూలై 18న నటాషా – హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు..ఇన్ స్టా గ్రామ్ లో సంయుక్తంగా ప్రకటించారు. ఈ దంపతులకు ప్రస్తుతం అగస్త్య అనే నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. అతడు నటాషా వద్ద పెరుగుతున్నాడు. భరణంగా నటాషాకు హార్దికి ఎంతిచ్చాడనేది ఇప్పటికీ తెలియ రాలేదు.