Hardik Pandya Girlfriends List: మైదానంలో దూకుడుగా ఉంటాడు. బౌలింగ్ లో అటాకింగ్ చూపిస్తాడు. బ్యాటింగ్లో ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. ఫీల్డింగ్లో నేర్పరితనాన్ని చూపిస్తాడు. ఇలా ఆల్రౌండర్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తాడు. అందువల్లే హార్దిక్ పాండ్యాకు సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అతడు ఏం చేసినా సరే సెన్సేషన్ అవుతుంది.
హార్దిక్ పాండ్యా టీమిండియాలోకి చాలా కష్టపడి వచ్చాడు. బౌలింగ్లో తను ఏంటో నిరూపించుకున్నాడు. బ్యాటింగ్లో తన సత్తా చూపించాడు. ఫీల్డింగ్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అందువల్లే జట్టులో స్థిరమైన స్థానాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు ట్రోఫీని అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత విలువైన ముంబై జట్టుకు సారధిగా కొనసాగుతున్నాడు. మైదానంలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడంలో హార్దిక్ పాండ్యా తర్వాతే ఎవరైనా. ఉదాహరణకు 2024 t20 వరల్డ్ కప్ తీసుకుంటే.. అప్పటిదాకా దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్ ప్రమాదకరంగా ఆడుతున్నాడు. అటువంటి ఆటగాడిని అత్యంత తెలివైన బంతివేసి బోల్తా కొట్టించాడు హార్దిక్. అతడు అవుట్ అయిన తర్వాత మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. దీంతో టీం ఇండియా విజేతగా నిలిచింది. ఆ వికెట్ తీయడంలో హార్దిక్ పాండ్యా ఎంతటి నేర్పరితనం ప్రదర్శించాడో ఇప్పటికి భారత జట్టులో కథలుగా చెప్పుకుంటారు.
హార్దిక్ పాండ్యా కేవలం పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ మాత్రమే కాదు.. అంతకు మించిన ప్లే బాయ్ కూడా. ఎందుకంటే హార్దిక్ పాండ్యా సంబంధాలు నడిపిన మహిళల జాబితా చాలా పెద్దది. వాస్తవానికి అతడు తన ప్రేమ ప్రయాణాన్ని లిషా శర్మతో మొదలుపెట్టాడు. 2016లో వారిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం మొదలైంది. ఆ తర్వాత ఏడాదికే ఆమెతో దూరం జరిగాడు. ఎల్లి అవరామ్ తో ఎఫైర్ మొదలుపెట్టాడు. 2017లో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు వచ్చాయి. పరిణితి చోప్రా తో కూడా సీక్రెట్ రిలేషన్ కూడా సాగిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏడాదికే అంటే 2018లో ఈషా గుప్తా తో రిలేషన్ మొదలు పెట్టాడని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఊర్వశి రౌతెలా తో రిలేషన్ కొనసాగించాడని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి.
ఇలా అనేక రూమర్స్ వచ్చిన తర్వాత కొంతకాలానికి అతడు నటాషాతో ప్రేమలో పడ్డాడు. ప్రేమలో ఉన్నప్పుడే నటాషా గర్భవతి అయింది. ఆమె గర్భంతో ఉన్నప్పుడే హార్దిక్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఒక బాబుకు జన్మనిచ్చింది. 2020లో మొదలైన వీరి రిలేషన్ 2024 వరకు కొనసాగింది. 2024లో నటాషా, హార్దిక్ పరస్పరం విడిపోతున్నట్టు ప్రకటించారు. మధ్యలో జాస్మిన్ తో రిలేషన్ మొదలు పెట్టినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అవి రూమర్స్ అని తేలిపోయాయి. చివరికి మహికతో హార్దిక్ పాండ్యాకు సెట్ అయింది. అయితే ఈ రిలేషన్ చివరి వరకు కొనసాగుతుందా.. మధ్యలోనే ముగిసిపోతుందా.. అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.