Homeక్రీడలుRCB Vs GT 2023: బెంగళూరు కథ మారదు: టాప్ 4 మీద అతిగా ఆధారపడడం.....

RCB Vs GT 2023: బెంగళూరు కథ మారదు: టాప్ 4 మీద అతిగా ఆధారపడడం.. ఈసారీ అదే కారణం.

RCB Vs GT 2023: “ఈసాలా కప్ నమదే(ఈసారి కప్పు మనదే) .. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేసిన ప్రచారం. కానీ వాస్తవంలో పరిస్థితి వేరే విధంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయి ఇంటి బాట పట్టింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ తో చెలరేగినప్పటికీ ఆ జట్టు విజయం సాధించలేకపోయింది. వాస్తవానికి ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి బెంగళూరు జట్టు మీద అభిమానులకు మంచి ఆశలు ఉండేవి. పైగా జట్టు కూర్పు కూడా బాగానే ఉంది. కానీ కీలక సమయాల్లో ఆటగాళ్లు చేతులు ఎత్తేయడంతో జుట్టు ఓటమిపాలై ఇంటి బాట పట్టింది.

నలుగురి మీద ఆధారపడింది

వాస్తవానికి ఈ సీజన్లో బెంగళూరు జట్టు కేవలం నలుగురు మీద మాత్రమే ఆధారపడింది. మిగతా ఆటగాళ్లు అంతగా ప్రభావం చూపకపోవడంతో గెలవాల్సిన మ్యాచులు ఓడిపోయింది. ఆదివారం నాడు గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ ఇదే ఆట తీరు ప్రదర్శించి తగిన మూల్యం చెల్లించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 197 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ ఒక్కడే 101 పరుగులు చేయడం విశేషం.. కీలకమైన మ్యాచ్లో అత్యుత్తమమైన ఆటగాళ్లు చేతులు ఎత్తేయడంతో బ్యాటింగ్ బారమ్ మొత్తం విరాట్ కోహ్లీ మీద పడింది.. తొలి వికెట్ కు 67 పరుగులు చేసిన బెంగళూరు జట్టు.. 85 పరుగులకే మిగతా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.. ఈ దశలో విరాట్ కోహ్లీ బ్యాట్ తో వీర విహారం చేశాడు కాబట్టి ఆ స్కోర్ సాధించింది. లేకుంటే 150 లపై ప్యాకప్ అయ్యేది. ఈ మ్యాచ్ మాత్రమే కాదు ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ, డూ ప్లేసెస్, మ్యాక్స్వెల్, బ్రేస్ వేల్ మీద మాత్రమే బెంగళూరు జట్టు అతిగా ఆధారపడింది. వీరు రాణించిన మ్యాచుల్లో బెంగళూరు గెలిచింది. వీరు రాణించని మ్యాచుల్లో ఓడిపోయింది.

మిగతావారు దేనికున్నట్టు

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. బెంగళూరు జట్టులో కీలకమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ జట్టు కప్ వేట లో చతికిలపడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మహిపాల్, బ్రేస్ వేల్, కార్తీక్, అనూజ్ రావత్ వంటి వారు కేవలం 30 పరుగుల లోపు చేయడం, ఇక కార్తీక్ అయితే డక్ అవుట్ కావడం ఆ జట్టు స్కోర్ పై భారీ ప్రభావం చూపించింది. ఒకానొక దశలో బెంగళూరు జట్టు 200 పరుగులకు మించి చేస్తుందని అభిమానులు ఆశించారు. విరాట్ కడవరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ అతడికి అండగా ఎవరూ లేకపోవడంతో జట్టు స్కోర్ 197 పరుగుల వద్ద ఆగిపోయింది.

ఊచ కోత కోశారు

లక్ష్య చేదనకు దిగిన గుజరాత్ జట్టు ప్రారంభంలో తడబడినప్పటికీ.. తర్వాత పుంజుకుంది. వృద్ది మాన్ సాహా, శుభ్ మన్ గిల్ చెలరేగి ఆడటంతో గుజరాత్ జట్టు గెలుపు బాట పట్టింది.. 25 పరుగుల వద్ద తొలి వికెట్ తీసిన బెంగళూరు బౌలర్లు తర్వాత వికెట్ 148 పరుగుల వద్ద పడగొట్టారు అంటే వారి బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.. కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్టు.. బెంగళూరు ఓటమికి ఎన్నో కారణాలు.. వాటిల్లో అతి ముఖ్యమైనది నలుగురు మీద ఆ జట్టు ఆధారపడటం.. ముందుగానే చెప్పినట్టు ఐపిఎల్ సీజన్ ప్రారంభంలో ఈసాలా కప్ నమదే అని ఆ జట్టు ప్రచారం చేసుకుంది. చివరికి కప్పు వేటలో చతికిల పడింది. విరాట్ కోహ్లీ సెంచరీ సాధించినప్పటికీ ఆ జట్టును గెలిపించలేకపోయాడు. ఓటమి అనంతరం డగ్ ఔట్ లో విచారంగా కూర్చోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..ఇదే సమయంలో ఓడినా గెలిచినా నువ్వే మా కింగ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular