IPL 2022: క్రికెట్‌లో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఏనుగు లాంటి బలంతో ఉన్న జట్టును బలహీన జట్టు ఓడించడం మనం చాలాసార్లు చూశాం. కొన్ని సార్లు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్న జట్టు కూడా అనూహ్యంగా గెలుస్తుంది. ఇంకొన్ని సార్లు లక్ అంటే ఇదేనేమో అన్నట్టు ఒక జట్టు వరుసగా గెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌ను చూస్తే ఇలాగే అనిపిస్తోంది.
ఐపీఎల్ సీజన్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ టీమ్.. వరుసగా రెండోసారి విజయాన్ని నమోదు చేసింది. హార్థిక పాండ్యా కెప్టెన్సీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. మొదటి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ మీద గెలిచిన హార్థిక్ పాండ్యా.. రెండో విజయాన్ని ఢిల్లీ మీద నమోదు చేశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఢిల్లీ అలవోకగా గెలిచే ఛాన్స్ ఉన్నా.. కొన్ని మిస్టేక్స్ వల్ల ఓడిపోయింది.
Also Read: AP Cabinet Expansion: ఎన్నికల టీమ్ రెడీ.. పూర్తయిన కేబినెట్ కూర్పు
పూణే వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 6 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. టాప్ ఆర్డర్ లో శుభమన్ గిల్ అద్భుతంగా ఆడి 84 పుగులు చేశాడు. అతనికి తోడుగా డేవిడ్ మిల్లర్ 20, హార్తిక్ 31 నిలిచారు. దీంతో వారి సమిష్టి కృషికి గుజరాత్ టైటాన్స్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలగిలింది. ఇక ఢిల్లీ బౌలర్లలో రహ్మన్ 3 వికెట్లు తీయగా.. కుల్దీప్ 1 వికెట్ తీశాడు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు చాలా త్వరగా చేతులెత్తేశారు. 172 పరుగులు లక్ష్యాన్ని చేధించలేక చతికిల పడ్డారు. సైఫర్టీ 3 (5) వికెట్ ను హార్థిక్ పడగొట్టి ఢిల్లీ పతనాన్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన పృథ్వీ షా (10) రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఇక పంజాబ్ ఆటగాడు మణిదీప్ సింగ్ (18) కూడా త్వరగానే గ్రౌండ్ వదిలాడు.
దీంతో ఐదు ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి కేవలం 34 పరుగులే చేసింది ఢిల్లీ. అయితే ఈ సమంయలో క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే పరుగులు రాబట్టాడు. కానీ తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 29 బంతుల్లో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు పంత్. ఆ తర్వాత ఎవరూ పెద్దగా బ్యాట్ తో ఆకట్టుకోలేకపోయారు.
గుజారత్ టైటాన్స్ నుంచి ఫెర్గుసన్ 4 వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలకంగా మారాడు. షమీ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ పాండ్యా, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసి తమ బాధ్యతతను నిర్వర్తించారు. ఇలా వీరంతా కలిసి కట్టుగా ఆర్ రౌండ్ ప్రదర్శన చేయడంతో తక్కువ లక్ష్యాన్ని కాపాడుకోగలిగారు. మొత్తంగా గుజరాత్ లక్ బాగానే ఉన్నట్టుంది. ఎంట్రీ ఇచ్చిన సీజన్‌లో ఇలా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడం మామూలు విషయం కాదు కదా.
Also Read:Amaravati Capital Issue: అమరావతిపై మడత పేచీ.. వైసీపీ ప్రభుత్వం కొత్త పల్లవి