GT bus fire incident: గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్రారంభ మ్యాచ్లలో ఓడిపోయింది. ఆ తర్వాత జూలు విధిల్చిన సింహం మాదిరిగా రెచ్చిపోయింది. వరుసగా గెలిచి ఏకంగా ప్లే ఆఫ్ దాకా వచ్చింది. గిల్, సాయి సుదర్శన్, బట్లర్, వాషింగ్టన్ సుందర్ వంటి ప్లేయర్లు గుజరాత్ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించారు. రబాడ, సిరాజ్, రషీద్ వంటి వారు కూడా బౌలింగ్ లో దుమ్మురేపారు. ఫలితంగా గుజరాత్ జట్టు ఫైనల్ దాకా వచ్చింది.
ఫైనల్లో సొంత మైదానంలో ఆడుతున్న నేపథ్యంలో గుజరాత్ మీద భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే బెంగళూరు ఆ అంచనాలను నేలకు దించింది. బెంగళూరు బౌలర్లు సత్తా చూపించడంతో.. గుజరాత్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేస్తుందనుకుంటున్న క్రమంలో ఓపెనర్లు గ్గిల్, సాయి సుదర్శన్ ను బెంగళూరు బౌలర్లు వెనక్కి పంపించారు. దీంతో ఆ జట్టు స్కోర్ వేగం చాలావరకు మందగించింది. ఇదే క్రమంలో బెంగళూరు ముందు ఒక స్థాయి లక్ష్యం కూడా విధించలేకపోవడంతో.. కన్నడ జట్టు దర్జాగా ట్రోఫీ ని ఎగరేసుకొని పోయింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ జట్టు ప్లేయర్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. స్టేడియం నుంచి హోటల్ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు వచ్చాయి. విపరీతంగా పొగలు అలముకున్నాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వారందరిని బయటకు తీసుకొని వచ్చారు. ప్లేయర్లు మొత్తం దాదాపు గంట సేపు రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. బస్సులో అగ్నిప్రమాదం జరగడం వల్లే ఇంతటి దారుణం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోడ్డు మీద ఉన్న ప్లేయర్లను ప్రత్యేకమైన బస్సులో మళ్ళి హోటల్ గదిలోకి దించారు.
“గుజరాత్ ప్లేయర్లకు అదృష్టం బాగోలేదు. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయారు. బస్సులో వెళ్తుంటే అగ్ని ప్రమాదం జరిగింది. వెంట్రుక వాసిలో ప్రాణ నష్టం తప్పింది. చూడబోతే వారి మీద ఎవరైనా మంత్రాలు చేశారా.. అందువల్లే ఇలా జరుగుతోందా.. అర్థం కావడం లేదని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
