GT Vs SRH 2025: హైదరాబాద్ జట్టులో కీలక బౌలర్ హర్షల్ పటేల్ జ్వరం కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. ఉప్పల్ లో స్లో పిచ్ పై అతడు గనుక బౌలింగ్ చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. కానీ దానిని పసిగట్టడంలో కమిన్స్ విఫలమయ్యాడు. అతని స్థానంలో జయదేవ్ ఉనద్కత్ ను తీసుకున్నాడు. కానీ అతని వల్ల కూడా ఉపయోగాలు లేకుండా పోయింది. చివరికి ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలోనూ కమిన్స్ తన బుర్రకు పని చెప్పలేదు. ఈ విషయంలోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ వెనుకబడింది.. ఇంపాక్ట్ ప్లేయర్ గా సిమర్ జీత్ సింగ్ ను తీసుకున్నాడు. అతడు బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. ఒక్క బంతిని మాత్రమే ఎదుర్కొన్న అతడు.. సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక బంతితో కూడా అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.. ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ వేసి.. 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ వాషింగ్టన్ సుందర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకున్నాడు. 29 బంతులు ఎదుర్కొన్న ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఏకంగా 49 పరుగులు చేశాడు. అంతేకాదు గిల్ తో కలిసి మూడో వికెట్ కు రికార్డు స్థాయిలో 56 బంతుల్లో 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వాషింగ్టన్ సుందర్ వీరోచిత ఆట తీరు మ్యాచ్ ను హైదరాబాద్ జట్టుకు దూరం చేసింది. గుజరాత్ జట్టుకు విజయాన్ని దగ్గర చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా మరో ఆటగాడిని గనక కమిన్స్ తీసుకొని ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది.
Also Read: సన్ రైజర్స్ ను దెబ్బకొట్టిన హైదరాబాదీ!
బౌలింగ్ విషయంలోనూ..
సాయి సుదర్శన్, బట్లర్ వికెట్లు కోల్పోయిన తర్వాత గుజరాత్ ఒకసారిగా ఒత్తిడికి గురైంది. ఇదే సమయంలో కమిన్స్ మరింత ఒత్తిడి పెట్టి ఉంటే మ్యాచ్ ఫలితం హైదరాబాద్ జట్టుకు అనుకూలంగా వచ్చి ఉండేది. కానీ అతడు జయదేవ్, సిమర్ జిత్ సింగ్, అన్సారి, అభిషేక్ శర్మ వంటి వారితో బౌలింగ్ చేయించడం మొదటికే మోసం వచ్చింది. స్లో వికెట్ వల్ల వీరంతా మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయారు. ఇక ఇదే సమయంలో గుజరాత్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కమిన్స్ సిమర్జిత్ సింగ్ కు బౌలింగ్ ఇవ్వడం మాచ్ స్వరూపాన్ని ఒకసారిగా మార్చేసింది. అతడు అత్యంత చెత్త బంతులు వేస్తూ.. ధారాళంగా పరుగులు ఇచ్చాడు. అంతేకాదు పవర్ ప్లే లో అత్యంత చెత్త ఎకనామి రేట్ నమోదు చేసిన బౌలర్ గా నిలిచాడు.. ఈ సీజన్లో పవర్ ప్లే లో అత్యంత చెత్త ఎకానమీ రేటు నమోదు చేసిన బౌలర్లలో సిమర్జిత్ సింగ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు ఎకానమీ రేట్ 14.20 కావడం విశేషం. లక్నో బౌలర్ ఆవేశ్ ఖాన్ 10.80, దీపక్ చాహర్ 10.50, మహేష్ తీక్షణ 10.33 ఎకనామీ రేట్లతో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. సిమర్జిత్ సింగ్ వేసిన ఒక ఓవర్ లోనే గుజరాత్ ఆటగాళ్లు 20 పరుగులు పిండుకున్నారంటే అతని బౌలింగ్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Washington Sundar recreated the Iconic GABBA shot vs Simarjeet Singh #SRHvsGT pic.twitter.com/C302bhpVzL
— Richard Kettleborough (@RichKettle07) April 6, 2025