Virat Kohli: విరాట్ కోహ్లి తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసింది. దీంతో ఆయన తన మనసులోని మాటలను వెల్లడించాడు. ఇన్నాళ్లు తన వెంట ఉంటూ సహరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపాడు. టీమిండియా కెప్టెన్ గా తన అనుభూతి మరిచిపోలేనిది. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉండటంతో ఎన్నో విజయాల సాధనలో ఎంతో సాధించామన్నాడు. విరాట్ సారథ్యంలో భారత జట్టు ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది.

నవంబర్ 17 నుంచి న్యూజీలాండ్ తో జరగనున్న టీ 20 సిరీస్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నట్లు తెలిసింది. కోచ్ గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు తీసుకోనున్నారు. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా రోహిత్ శర్మకే కెప్టెన్ పగ్గాలను చేపట్టనున్నాడు. అయితే కోహ్లి(Virat Kohli) సేన టీ20 ప్రపంచ కప్ లో నిరుత్సాహ పరిచిన సంగతి తెలిసిందే.
తొలి రెండు మ్యాచుల్లో పాక్, కివీస్ పై ఓటమి చెందడంతో సహజంగా విమర్శల పాలయింది. సెమీస్ చేరకుండానే వెనుదిరిగింది. దీంతో కోహ్లి సేనపై విమర్శల వెల్లువ కొనసాగింది. అప్పటి నుంచే కోహ్లి ని తప్పిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కు కెప్టెన్ పగ్గాలు అప్పగిస్తున్నారని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం టీమిండియాపై విమర్శలు పెరిగాయి. టీ 20 ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శనపై అభిమానుల్లో నైరాశ్యం పెరిగింది. దీంతో ఆటగాళ్లపై వ్యక్తిగత విమర్శలు సైతం గుప్పించారు. కానీ విజయం సాధించినప్పుడు ప్రశంసలు అపజయం కలిగినప్పుడు విమర్శలు రావడం సహజమే.
Also Read: ఇక అన్ని మ్యాచ్ లు గెలవాల్సిందే..!లేకుంటే..?