
Akhanda: నందమూరి నటసింహం బాలయ్య బాబు “అఖండ” కోసం అశేష అభిమాన జనం వేయి కళ్లతో ఎదురు చూడలేక ఇప్పటికే నీరసించి పోయారు. ఈ నీరసం ఇలాగే కొనసాగితే ఓపెనింగ్స్ రావడం కూడా కష్టం అవుతుంది కాబట్టి.. బోయపాటి రంగంలోకి దిగాడు. తమ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో ఊపు పెంచాడు. ఊపు అయితే పెంచాడు గానీ, ప్రమోషన్స్ కి మాత్రం ఊపు అయితే రాలేదు.
ఇంకా ఎక్కడో తేడా కొడుతోంది. మరోపక్క బాలయ్య ‘అఖండ’ పై భారీ అంచనాలు ఉన్నాయని మీడియా తెగ రాస్తూ బాగా హడావిడి చేస్తోంది. కాకపోతే ఆ అంచనాల్లో నిజం లేదనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని, బాక్సాఫీస్ వద్ద బాలయ్య రేంజ్ డిసైడ్ కాదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. థమన్ అందించిన పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ బాగా ఆకట్టుకుంది.
బాలయ్య జోరు మీద ఉన్నాడని ఆయన అభిమానులు మరింతగా సాంగ్ పై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, “అఖండ”(Akhanda) థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ బాగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ నెల 15వ తేదీన అఖండ ట్రైలర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ప్రస్తుతం ట్రైలర్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
కానీ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. రిలీజ్ డేట్ ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే, డిసెంబర్ 2న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క చిత్రబృందం నుంచి అందుతున్న టాక్ ప్రకారం డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక్కడ ఒక సమస్య ఉంది. పుష్ప సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. అఖండ, పుష్ప పోటీ పడితే డిస్ట్రిబ్యూటర్లకే ఎక్కువ నష్టం. అందుకే డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయంలో సీరియస్ అవుతున్నారు. మొత్తమ్మీద అఖండ రిలీజ్ పెద్ద సమస్యగా మారింది.
Also Read: పూనకాలు పెట్టిస్తోన్న ‘భం భం అఖండ’.. బాలయ్య ఫ్యాన్స్ పండగ!