Gongadi Trisha : ఆ సిరీస్లో త్రిష పరుగుల వరద పారించింది.. దీంతో ఆమెను కాబోయే మిథాలి రాజ్, స్మృతి మందాన, షేఫాలి వర్మ అవుతుందని అందరూ జోస్యం చెప్పారు.. నాటి అండర్ 19 ప్రపంచ కప్ లో స్కాట్లాండ్ మీద వీరోచితమైన సెంచరీ చేసి త్రిష భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించింది. ఏకంగా 59 బాల్స్ ఎదుర్కొన్న త్రిష 110 రన్స్ చేసింది. అంతేకాదు చివరి వరకు ఆమె క్రీజ్ లో ఉంది. ఆమె ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు, 13 బౌండరీలు ఉన్నాయి.. త్రిష అండర్ -19 లో మాత్రమే కాదు, అండర్ – 16 లో కూడా ఆడింది. అండర్ – 23లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అండర్ -19 , టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో లో త్రిష 44 రన్స్ మాత్రమే కాకుండా.. 3 వికెట్స్ కూడా పడగొట్టింది. భారత్ సాధించిన విజయంలో ముఖ్యపాత్ర పోషించింది.
Also Read : ఒలింపిక్స్ టార్గెట్.. దేశ క్రీడారంగాన్నే మార్చే అద్భుత ఆలోచన ఇదీ!
చోటు లభించలేదు
టీమిండియా మహిళల జట్టు వన్డే, టి20 టోర్నీల కోసం వచ్చే నెలలో ఇంగ్లాండ్ వెళ్తుంది. ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టి20 లు, మూడు వన్డేలలో తలపడుతుంది.. ఈక్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఉమెన్స్ టీమ్ ను ప్రకటించింది. ఈ రెండు సిరీస్ లకు టీమ్ ఇండియాకు కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ గా స్మృతి మందాన ను ఎంపిక చేసింది. అటు వన్డే, ఇటు టి20 జట్లలో తెలుగు తేజం త్రిషకు స్థానం లభించలేదు.. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. త్రిష అభిమానులు బిసిసిఐ పెద్దలను ఆమెను ఎంపిక చేయకపోవడం పట్ల ప్రశ్నిస్తున్నారు.. అయితే దీని వెనుక ఒక కారణం ఉంది. ఎందుకంటే త్రిష ఆటను మరింత మెరుగుపరచుకోవడానికి ఇటీవల హై పెర్ఫార్మెన్స్ శిబిరానికి ఎంపికైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరానికి ధృతి అనే మరో ప్లేయర్ కూడా ఎంపికైంది. ఏప్రిల్ 21 నుంచి మే 15 వరకు ఈ శిబిరం నిర్వహించారు. త్రిష అండర్ 19 t20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గా అదరగొట్టింది. 309 పరుగులతో పాటు 7 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకుంది. మొత్తంగా తిరుగులేని ప్లేయర్ గా ఆమె అవతరించింది. అయితే ఇంగ్లాండ్ జట్టుతో వచ్చే నెలలో జరిగే టి20, వన్డే సిరీస్ కు త్రిషను ఎంపిక చేయకపోవడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది..”త్రిష ట్రైనింగ్ క్యాంప్ కూడా పూర్తయింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ జరుగుతుంది. ఇది టీమిండియా మహిళల జట్టుకు ఎంతో ముఖ్యమైన సిరీస్. అలాంటి సిరీస్ కు త్రిషను ఎంపిక చేయకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని” సీనియర్ ప్లేయర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
శరీర సామర్థ్యపరంగా..
వాస్తవానికి త్రిష శరీర సామర్థ్యం పరంగా ఇప్పుడు నెంబర్ వన్ కేటగిరిలో ఉంది.. మరోవైపు శ్రేయాంక పాటిల్, రేణుక సింగ్ కాయలతో ఇబ్బంది పడుతున్నారు. వీరిద్దరిని జట్టు మేనేజ్మెంట్ ఎంపిక చేయలేదు.. ఇటీవల శ్రీలంక దేశంలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ లోనూ వీరిద్దరూ ఆడలేదు. వన్డే జట్టు నుంచి కశ్వి గౌతమ్ ను సెలెక్టర్లు తప్పించారు. అయితే వీరిని పక్కన పెట్టడానికి మేనేజ్మెంట్ కు కారణాలు ఉన్నాయి. మరి త్రిష విషయంలో ఎలాంటి కారణాలను మేనేజ్మెంట్ చెప్పడం లేదు. స్నేహ్ రాణా కంటే కూడా త్రిష మెరుగైన ఆల్రౌండర్. కానీ రాణా కు టి20 జట్టులో అవకాశం లభించడం విశేషం. ఇక వైఎస్ఆర్ జిల్లాకు చెందిన శ్రీ చరణ్ కూడా వన్డే, టి20 లలో స్థానం సంపాదించింది. జూన్ 28 నుంచి భారత్ ఇంగ్లాండ్ దేశంలో పర్యటిస్తుంది. కాగా, త్రిష హై పెర్ఫార్మెన్స్ క్యాంపు కు వెళ్లిన నేపథ్యంలో ఒత్తిడి పెంచకూడదని.. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కు దూరంగా ఉంచినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే దీనిపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.