Homeక్రీడలుక్రికెట్‌Glenn Phillips: ఇవేం క్యాచ్ లు పట్టడం రా బాబూ.. జాంటీ రోడ్స్ అయ్య లా...

Glenn Phillips: ఇవేం క్యాచ్ లు పట్టడం రా బాబూ.. జాంటీ రోడ్స్ అయ్య లా తయారయ్యావ్

Glenn Phillips:  ఐసీసీ చాంపియన్ ట్రోఫీ.. దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ తలపడుతున్నాయి.అప్పటికే భారత్ 5.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. 22 పరుగులకే గిల్(2), రోహిత్ (15) వికెట్లు కోల్పోయింది. క్రీజ్ లో శ్రేయస్ అయ్యర్ (0), విరాట్ కోహ్లీ (11) ఉన్నారు. విరాట్ కోహ్లీ అంతకుముందు పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. శ్రేయసయ్యర్ కూడా సూపర్ ఫామ్ లో ఉండడంతో తిరుగు లేదనుకున్నారు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ బౌలింగ్ వేస్తున్నాడు. అప్పటికీ ఆరో ఓవర్ లో మూడు బంతులు వేశాడు. నాలుగో బంతికి విరాట్ గట్టిగా షాట్ కొట్టాడు. కచ్చితంగా అది ఫోర్ వెళ్తుందని నమ్మకంతో ఉన్నాడు. బంతి రావడమే ఆలస్యం బ్యాట్ ను లఘాయించి కొట్టాడు విరాట్. ఆ బంతి కాస్త అమాంతం రాకెట్ వేగంతో వెళ్ళింది. కానీ అక్కడే ఉన్న ఫిలిప్స్ ఆ బంతిని గాల్లోకి ఎగిరి పట్టుకున్నాడు. అది కూడా ఒక్క చేతితో.. విరాట్ కూడా అలాగే చూస్తూ ఉండిపోయాడు. వాస్తవానికి ఫిలిప్స్ స్థానంలో మరే ఫీల్డర్ ఉన్నప్పటికీ ఆ బంతిని క్యాచ్ అందుకోలేకపోయేవాడు. ఒంట్లో ఎముకలు లేనట్టు.. పక్షి వారసత్వాన్ని కలిగి ఉన్నట్టు.. భార రహిత స్థితిని ఆస్వాదిస్తున్నట్టు అలా అమాంతం బంతిని అందుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ బిత్తర పోయాడు. కొద్ది క్షణాలపాటు అలానే ఉండిపోయాడు. ఆ తర్వాత అత్యంత నిరాశతో మైదానాన్ని వదిలి వెళ్ళిపోయాడు. విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, న్యూజిలాండ్ ప్లేయర్లు కూడా ఫిలిప్స్ చేసిన సాహసాన్ని అలానే చూశారు. విరాట్ తన చేతుల్లో అవుట్ అయిన వెంటనే పక్షిలాగా ఎగిరాను కదూ అంటూ ఫిలిప్స్ తన హావాభావాలను వ్యక్తం చేశాడు.

జాంటి రోడ్స్ ను బీట్ చేస్తాడా?

సమకాలీన క్రికెట్లో చాలామంది ఆటగాళ్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. అయితే ఫిలిప్స్ మాత్రం వారందరికంటే భిన్నంగా ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే దక్షిణాఫ్రికా మేటి ఫీల్డర్ జాంటీ రోడ్స్ ను గుర్తుకు తెస్తున్నాడు. జాంటీ రోడ్స్ దక్షిణాఫ్రికా జట్టుకు వజ్రాయుధం లాగా ఫీల్డింగ్ చేసేవాడు. బ్యాక్ వర్డ్ పాయింట్, మిడ్ ఆఫ్, గల్లీ, మిడ్ ఆన్ వద్ద అతడు గోడ మాదిరిగా ఉండేవాడు. జాంటీ రోడ్స్ 52 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 34 క్యాచ్లు పట్టాడు. వైట్ బాల్ ఫార్మాట్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా ఐదు క్యాచ్లు అందుకున్నాడు. తన కెరియర్లో మొత్తం 105 క్యాచ్లు అందుకున్నాడు. ఒక సిరీస్ లో అయితే ఏకంగా తొమ్మిది క్యాచ్లు పట్టుకున్నాడు. అతడు మొత్తంగా 105 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఇక ఫిలిప్స్ విషయానికి వస్తే.. ఇతడు 15 టెస్ట్ మ్యాచ్ లలో 16 క్యాచ్లు పట్టాడు. ఇక పరిమిత ఓవర్ ఫార్మాట్ లలో అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన చేశాడు. ఫిలిప్స్ 24 వన్ డే క్యాచ్లు పట్టాడు. 51 t20 క్యాచులు అందుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీని 24వ క్యాచ్ అవుట్ గా ఫిలిప్స్ తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం ఫిలిప్స్ వయసు 28 సంవత్సరాలు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్ గా అతడు పేరు పొందాడు. బ్యాక్ వర్డ్ పాయింట్ మైదానంలో గోడ మాదిరిగా ఉంటూ.. పరుగులను నియంత్రిస్తూ.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళను అవుట్ చేయడంలో ఫిలిప్స్ సిద్ధహస్తుడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version