Gautam Gambhir is experimenting
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ తన జట్టును ప్రకటించింది. అయితే ఇందులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు.. ఈ బౌలర్ల జాబితాలో టీమిండియా పేసు గుర్రం జస్ ప్రీత్ బుమ్రా( Jaspreet bumrah) లేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి అతడు వెన్నునొప్పి నుంచి కోలుకున్నప్పటికీ రిస్క్ వద్దని అజిత్ అగార్కర్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే 2022లోనే బుమ్రా కు బ్యాక్ సర్జరీ అయింది. అంతలోనే అతడికి మళ్ళీ గాయం తిరగబెట్టింది. అందువల్లే రిస్క్ వద్దని బుమ్రా ను అజిత్ అగార్కర్ పక్కన పెట్టాడు. అయితే అలా అతడిని పక్కన పెట్టడం.. హర్షిత్ రాణా ను జట్టులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. దుబాయ్ వెళ్లే జట్టులో రవీంద్ర జడేజా (Ravindra Jadeja), అక్షర్ పటేల్(Akshar Patel), వాషింగ్టన్ సుందర్(Washington Sundar), కులదీప్ యాదవ్(Kuldeep Yadav), వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ఉన్నారు. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ను తీసుకోవడం.. మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, శివం దూబే వంటివారు స్థానం దక్కించుకున్నారు. భద్రతా కారణాలవల్ల భారత్ దుబాయ్ లో మ్యాచ్లు ఆడుతుంది. అయితే 2009 నుంచి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో 58 వన్డేలు జరిగాయి. అయితే ఇందులో ఫాస్ట్ బౌలర్లే ఐదు కంటే తక్కువ ఎకానమీ రేటుతో 466 వికెట్లు సాధించారు. స్పిన్ బౌలర్లు 4.2 ఎకనామీ రేటుతో 334 వికెట్లు పడగొట్టారు. అదే టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్ బౌలర్లను ఎక్కువగా ఎంపిక చేయడం.. జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
నష్టం కలిగిస్తుందా
షార్జా మైదానంతో పోల్చి చూస్తే దుబాయ్ మైదానం బౌలర్లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లు వికెట్లను పడగొడుతున్నారు. అందువల్లే పాకిస్తాన్ జట్టు ఎక్కువమంది పాస్టర్ బౌలర్లను ఎంపిక చేసుకుంది. అయితే ఇక్కడ ఎక్కువ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా మేనేజ్మెంట్ ఐదుగురు స్పిన్ బౌలర్లను ఎందుకు తీసుకుంది అనేది అంతు పట్టకుండా ఉంది. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. 2021 t20 వరల్డ్ కప్ లో అతడు విఫలమయ్యాడు. పేస్ బౌలర్లలో షమి అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. మరోవైపు హర్షిత్ రాణా ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లో సత్తా చాటినప్పటికీ.. దుబాయ్ మైదానంలో ఈ మేరకు రాణిస్తాడనేది వేచి చూడాల్సి ఉంది.. హార్థిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ బంతి మీద ఏ స్థాయిలో పట్టుకొని కొనసాగిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే వీరు అంచనాల మించి రాణిస్తేనే గంభీర్ చేసిన ప్రయోగాలకు సార్ధకత ఉంటుంది. లేకపోతే గంభీర్ కోచ్ పదవి ప్రశ్నార్థకంగా మారుతుంది.