Gautam Gambhir: మంగళవారం సాయంత్రం టీమ్ ఇండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ పేరును ప్రకటించడమే ఆలస్యం.. పరిణామాలు మొత్తం వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం జింబాబ్వే టూర్ లో టీమిండియా ఉంది. అది పూర్తికాగానే ఈ నెలాఖరున శ్రీలంక వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి గంభీర్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు శిక్షణ పొందాల్సి ఉంటుంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు గౌతమ్ గంభీర్ కోచ్ గా వ్యవహరిస్తాడు. అప్పటివరకు టీమిండియా దాదాపు 5 icc టోర్నీలలో ఆడాల్సి ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆడాల్సి ఉంటుంది.. 2026 లో టి20 వరల్డ్ కప్, 2027లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలు జరుగుతాయి.
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలను దృష్టిలో పెట్టుకొని తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని గౌతమ్ గంభీర్ ఇది వరకే బీసీసీఐ పెద్దలను కోరాడు. దీనికి వారి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఫలితంగా గౌతమ్ గంభీర్ కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కోచ్ గా పనిచేసిన అభిషేక్ నాయర్ ను టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..కోల్ కతా జట్టు తరఫున గత ఐపీఎల్ సీజన్లో గౌతమ్ గంభీర్, అభిషేక్ నాయర్ కలిసి పని చేశారు. ఆ జట్టును విజేతగా నిలిపారు. అయితే అభిషేక్ నియామకాన్ని త్వరలోనే బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది. అభిషేక్ రాకతో ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోర్ బయటికి వెళ్లక తప్పడం లేదు.
ఫీల్డింగ్ కోచ్ విషయంలో గౌతమ్ గంభీర్ పెద్దగా ప్రయోగాలు చేయడం లేదు. ఎందుకంటే భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ గా ప్రస్తుతం దిలీప్ కొనసాగుతున్నాడు. టీమిండియా జట్టు ఫీల్డింగ్ అద్భుతమైన ప్రమాణాలను సాధించడంలో దిలీప్ తీవ్రంగా కృషి చేశాడు. ఇటీవల టి20 వరల్డ్ కప్ లో అక్షర్ పటేల్ ఆస్ట్రేలియాపై , సూర్య కుమార్ యాదవ్ దక్షిణాఫ్రికాపై ఆ స్థాయిలో క్యాచ్ లు అందుకున్నారంటే దానికి దిలీప్ ఫీల్డింగ్ కోచింగే కారణం.. అందువల్లే దిలీప్ ను కొనసాగించాలని గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక టీమిండియా బౌలింగ్ కోచ్ గా ప్రస్తుతం పరాజ్ మాంబ్రే కొనసాగుతున్నాడు. అయితే అతని స్థానంలో బౌలింగ్ కోచ్ గా వినయ్ కుమార్ పేరును గౌతమ్ గంభీర్ ప్రతిపాదనకు తీసుకున్నాడు. అయితే దీనికి సంబంధించి బిసిసిఐ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
కోచ్ కంటే ముందు గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా కొనసాగాడు. 2007 t20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లలో గంభీర్ కీలక పరుగులు చేసి.. జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2012, 2014 ఐపీఎల్ సీజన్లలో కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా జట్టుకు మెంటార్ గా వ్యవహరించి విజేతగా నిలిపాడు..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Gautam gambhir has been appointed as the head coach of team india 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com