Cricketers Funny Names: నట్లు ..బోల్టులు ఇవే మన క్రికెటర్ల పేర్లు.. వైరల్

కొంతమంది క్రికెటర్ల పేర్లు అచ్చ మన వసుతవులను పోలినట్లే ఉన్నాయి. కొన్ని పేర్లు మనకు నోరు తిరగకపోయినా.. కొందరి పేర్లు మాత్రం మన నిత్యావసర వస్తువులను తలపిస్తున్నాయి. నవ్వు తెప్పిస్తున్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా మన వస్తువుల పేర్లు ఉన్న క్రికెటర్లు ఎవరో చూద్దాం.

Written By: Raj Shekar, Updated On : January 31, 2024 4:28 pm

Cricketers Funny Names

Follow us on

Cricketers Funny Names: క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఇంగ్లండ్‌లో పుట్టిన ఈ క్రీడ క్రమంగా విశ్వవాప్తమైంది. సరికొత్త రూపు సంతరించుకుంటోంది. దీంతో క్రికెట్‌ ఆడే దేశాలు, క్రీడాకారులు పెరుగుతున్నారు. పాత తరం రిటైర్‌ అవుతుంటి యువ రక్తం ఉత్సాహంగా జట్టలోకి వస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొంతమంది క్రికెటర్ల పేర్లు అచ్చ మన వసుతవులను పోలినట్లే ఉన్నాయి. కొన్ని పేర్లు మనకు నోరు తిరగకపోయినా.. కొందరి పేర్లు మాత్రం మన నిత్యావసర వస్తువులను తలపిస్తున్నాయి. నవ్వు తెప్పిస్తున్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా మన వస్తువుల పేర్లు ఉన్న క్రికెటర్లు ఎవరో చూద్దాం.

హోల్డర్‌(వెస్టిండీస్‌)
హోల్డర్‌.. వెస్టిండీస్‌ క్రికెట్‌ అయిన ఈయన పేరును మనం నిత్యం ఇళ్లలో వాడే బల్బును బిగించే వస్తువు హోల్డర్‌గా అనిపిస్తుంది.

నట్‌(ఆస్ట్రేలియా)..
నట్‌ పేరు ఉన్న ఈ క్రికెటర్‌ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే మనం నట్‌గా మోటార్లు, వాహనాలకు బిగించే వస్తువును పిలుచుకుంటాం

బోల్డ్‌(న్యూజిలాండ్‌)
న్యూజిలాండ్‌ బౌలర్‌ పేరు బోల్డ్‌. మంచి సీమ్‌ బౌలర్‌. కానీ, మనం బోల్ట్‌ అంటే ఏదైనా వస్తువును బిగించడానికి వాడేది.

లుంగీ(సౌత్‌ ఆఫ్రికా)
ఇక సౌత్‌ ఆఫ్రీకా బౌలర్‌ పేరు లుంగీ. ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్ల పేర్లు వెరైటీగా ఉంటాయి. ఇక మనం మాత్రం లుంగీ అంటే కట్టుకేది.

షాట్‌(ఇంగ్లండ్‌)
ఇంగ్లండ్‌ క్రికెటర్‌ పేరు షాట్‌.. మనమేమో.. ఒంటికి ధరించేదాన్ని షాట్‌ అని పిలుస్తాం.

టైలర్‌(న్యూజిలాండ్‌)
న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ పేరు టైలర్‌.. మనం టైలర్‌ అంటే దర్జీని పిలుస్తాం.

బర్గర్‌(ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడి పేరు బర్గర్‌. మనం మాత్రం బర్గర్‌ అనగానే గుర్తొచ్చేది తినే పదార్థం.
వుడ్‌(ఇంగ్లండ్‌)
ఇక ఇంగ్లండ్‌కు చెందిన ఫాస్ట్‌ బౌలర్‌ పేరు వుడ్‌. మనం వుడ్‌ అంటే కర్రను పిలుస్తాం.

ఆమ్లా(సౌత్‌ ఆఫ్రికా)
సౌత్‌ ఆఫ్రికా ఆల్‌రౌండర్‌ పేరు ఆమ్లా. మనం మాత్రం ఆమ్లా అనగానే ఉసిరికాయలు అంటాం.

రూట్‌(ఇంగ్లండ్‌)
రూట్‌ ఈపేరు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఉంది. కానీ రూట్‌ అంటే వేర్లు అని మనం పిసుస్తాం.

స్టోన్‌(న్యూజిలాండ్‌)
ఈ క్రీడాకారుడు కూడా న్యూజిలాండ్‌ క్రికెటర్‌. స్టోన్‌ అనగానే మనకు రాయి గుర్తుకు వస్తుంది.

నోకియా(సౌత్‌ ఆఫ్రికా)
ఇక నోకియా ఒక ఫోన్ల తయారీ కంపెనీ పేరు. కానీ ఈపేరుతో సౌత్‌ ఆఫ్రికా క్రికెట్‌ జట్టులో ఆటగాడు ఉన్నాడు.

శాంసంగ్‌(వెస్టిండీస్‌)
శాంసంగ్‌ అంటే కూడా ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ గుర్తుకు వస్తుంది. కానీ వెస్టిండీస్‌లో ఈ పేరతో క్రికెటర్‌ ఉన్నారు.

సాల్ట్‌(ఇంగ్లండ్‌)
ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టులో సాల్ట్‌ పేరుతో ఓ క్రికెటర్‌ ఉన్నారు. మనం సాల్ట్‌ అంటే ఉప్పును పిలుస్తాం. ప్రపంచం అంతా కూడా సాల్ట్‌ అంటే ఉప్పునే పిలుస్తారు. కానీ, క్రికెటర్‌ ఈ పేరు పెట్టుకున్నాడు.