https://oktelugu.com/

India Cricket Team: 2003 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ టీమ్ కు అవే వైఫల్యాలు, అవే అవమానాలు..? కారణమేంటి..?

వరుసగా 10 విజయాలను అందుకొని ఇండియన్ టీం ఫైనల్ కి చేరుకుంది. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా మీద దారుణమైన పరాజయాన్ని మూట గట్టుకుంది. ఇక ఆ టోర్నీ ముగిసిన తర్వాత ఆడిన టి20 సిరీస్ లో సత్తా చాటుతూ ముందుకు వెళ్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 8, 2023 2:53 pm
    India Cricket Team

    India Cricket Team

    Follow us on

    India Cricket Team: ఇండియన్ టీం వరల్డ్ కప్ ఫైనల్ లో చాలా దారుణమైన పరిస్థితిలో ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది. ఇక ఆ టోర్నీ తర్వాత ఆడిన టి 20 సీరీస్ లో తనదైన రీతిలో పుంజుకొని ఆడుతుంది. అయితే వన్డే వరల్డ్ కప్ కి ముందు ఆస్ట్రేలియా ని 2-1 తేడా తో ఓడించి వరల్డ్ కప్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఇండియన్ టీం…వరల్డ్ కప్ లీగ్ దశలో మొదటి మ్యాచ్ ని ఆస్ట్రేలియా తో ఆడి వాళ్లని చిత్తు చేసి వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని దక్కించుకుంది.

    ఇక అప్పటి నుంచి వరుసగా 10 విజయాలను అందుకొని ఇండియన్ టీం ఫైనల్ కి చేరుకుంది. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా మీద దారుణమైన పరాజయాన్ని మూట గట్టుకుంది. ఇక ఆ టోర్నీ ముగిసిన తర్వాత ఆడిన టి20 సిరీస్ లో సత్తా చాటుతూ ముందుకు వెళ్తుంది. అయితే ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా మీద నాకౌట్ మ్యాచ్ ల్లో ఎందుకు తడబడుతుంది. మిగిలిన మ్యాచ్ ల్లో లేని తడబాటు నాకౌట్ మ్యాచ్ లకి ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం…

    మిగితా మ్యాచ్ లు ఓడిపోయిన పెద్ద ప్రాబ్లం లేదు కానీ గెలవాల్సిన ఒక్క నాకౌట్ మ్యాచ్ లో మాత్రం ఇండియన్ టీం ఓడిపోయి అభిమానులందరిని నిరాశపరుస్తుంది.ఇది ఇప్పుడు అనే కాదు ప్రతిసారీ ఇలానే జరుగుతుంది. 2003 వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా మీద దారుణంగా ఓడిపోయి అడుగు దూరం లో వరల్డ్ కప్ ను చేజార్చుకుంది. ఇక ఇప్పుడు కూడా సేమ్ అదే పొజిషన్ లో కప్పును కోల్పోయింది…ఇక 2003 కి 2023 కి మధ్య ఇండియన్ టీమ్ ఏం మారింది. నాకౌట్ లో ఆస్ట్రేలియా తో మ్యాచ్ అంటే గెలుస్తామా, లేదా అని మనవాళ్ళకి ఇప్పటికీ భయమే…అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది. ఆస్ట్రేలియా తో ఫైనల్ మ్యాచ్ అంటే ఇండియన్ టీం ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదు.

    ఇప్పటికైనా ఆస్ట్రేలియా మీద నాకౌట్ మ్యాచ్ ఎలా గెలవాలి అనే దానిమీద ఫోకస్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే మనవాళ్ళు ఐసిసి నిర్వహించే ప్రతి టోర్నీ లో ఈజీగా సెమీస్ కి కానీ, ఫైనల్ కి కానీ చేరుకుంటారు. కానీ అక్కడ గెలిచి కప్పు ఎలా సాధించాలి అనే దానిమీద మన ప్లేయర్లు శిక్షణ ఇవ్వాలి. 2024 వ సంవత్సరం లో ఆడబోయే వరల్డ్ కప్ కోసం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ టీమ్ మ్యాచ్ లు ఆడితే టి20 వరల్డ్ కప్ అయిన కొట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే అక్కడ కూడా ఆస్ట్రేలియా లాంటి టీంలు మనల్ని డామినేట్ చేసి కప్పు ఎగరేసుకుపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

    ఇప్పటికైనా ఇండియన్ టీమ్ ప్లేయర్లు గాని, బీసీసీఐ గాని టీంలో జరుగుతున్న అవకతవకలు ఏంటో తెలుసుకుని వాటిని సరి చేసుకుంటే మంచిది లేకపోతే మాత్రం ఇకమీదట జరిగే అన్ని టోర్నీల్లో కూడా ఇండియా ఓడిపొక తప్పదు…వరల్డ్ లో మన టీమ్ నెంబర్ వన్ స్థానం లో ఉంటే మంచిందే కానీ ఐసిసి నిర్వహించే టోర్నీ కొట్టినప్పుడే కదా ఆ నెంబర్ వన్ స్థానానికి ఒక సార్థకత ఉండేది…