https://oktelugu.com/

France vs Morocco : ఇంగ్లండ్ ఔట్.. ఫ్రాన్స్ సెమీస్ కు.. మొరాకోతో ఢీ

France vs Morocco : 2018లో సాకర్ ప్రపంచకప్ ను ఫ్రాన్స్ జట్టు ఒడిసి పట్టింది. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని కసి తీరా ఆడుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు..ఇదే క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్ లోనూ ఫ్రాన్స్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 2_1 తేడా తో విజయం సాధించింది.. దర్జాగా సెమిస్ పోరులో కి ప్రవేశించింది. హోరా హోరీగా సాగిన క్వార్టర్ పైనల్ మ్యాచ్ లో ఇరు జట్లూ తమ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2022 / 08:52 AM IST
    Follow us on

    France vs Morocco : 2018లో సాకర్ ప్రపంచకప్ ను ఫ్రాన్స్ జట్టు ఒడిసి పట్టింది. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని కసి తీరా ఆడుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు..ఇదే క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్ లోనూ ఫ్రాన్స్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 2_1 తేడా తో విజయం సాధించింది.. దర్జాగా సెమిస్ పోరులో కి ప్రవేశించింది. హోరా హోరీగా సాగిన క్వార్టర్ పైనల్ మ్యాచ్ లో ఇరు జట్లూ తమ శక్తిని మొత్తం దారపోశాయి. అయినప్పటికీ ఫ్రాన్స్ జట్టు నే విజయం వరించింది. ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ జట్టు బంతిని ఎక్కువ శాతం తన నియంత్రణలో ఉంచుకుంది. ఇక ఇంగ్లాండ్ జట్టు అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయింది. మరోవైపు ఫ్రాన్స్ జట్టు ఆటగాళ్లు గోల్ పోస్ట్ వైపు పదేపదే దూసుకు వచ్చినప్పటికీ ఎక్కువ గోల్స్ చేయలేకపోయారు..

    మ్యాచ్ సాగింది ఇలా

    తొలి అర్ధభాగంలో 17 నిమిషాల వద్ద ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోనీ గ్రిజ్ మెన్ నుంచి పాస్ అందుకున్న అరెలియన్ చౌమెనీ అద్భుతమైన గోల్ సాధించి ఫ్రాన్స్ జట్టులో ఆనందం నింపాడు. దీంతో ఫ్రాన్స్ 1_0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఫ్రాన్స్ జట్టు ఆటగాళ్ళు మరింత రెచ్చిపోయారు. గోల్ పోస్ట్ వద్ద ఒక అడ్డు గోడ లా నిల బడ్డారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లను నిలువరించారు. ఒకానొక దశలో ఇంగ్లాండ్ జట్టు అసలు గోల్ సాధించే స్థితిలో కనిపించలేదు.

    నాటకీయ పరిణామాలు

    ఫ్రాన్స్ తొలి గోల్ సాధించిన తర్వాత మ్యాచ్లో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక మ్యాచ్ రెండో అర్ధ భాగంలో 54 నిమిషాల వద్ద బ్రిటన్ ఆటగాడు హారీ కేన్ పెనాల్టీ కిక్ ను గోల్ గా మలిచాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. 78 నిమిషాల వద్ద ఆంటోని గ్రీజ్ మెన్ నుంచి క్రాస్ అందుకున్న ఒలివర్ గి రౌడ్ అద్భుతమైన రీతిగా గోల్ సాధించి ఫ్రాన్స్ ను 2_1 ఆధిక్యంలో నిలిపాడు. ఈ క్రమంలో 84 నిమిషం వద్ద ఇంగ్లాండ్ కు మరో పెనాల్టీ అవకాశం లభించింది. అయితే తొలి పెనాల్టీని గోల్ గా మలిచిన హారీ కేన్ రెండో పెనాల్టీని గోల్ గా మలచడం లో విఫలమయ్యాడు. బంతి గోల్ పోస్ట్ వైపు వెళ్లడంతో ఇంగ్లాండ్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయినప్పటికీ చివరి వరకు ఇంగ్లీష్ జట్టు ప్రయత్నం చేసింది. మరో గోల్ చేయలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ విజయంతో ఫ్రాన్స్ జట్టు సెమీస్ లో మొరాకో ను ఢీ కొంటుంది. మరో సెమీస్ లో అర్జెంటినా క్రొయేషియా తో తలపడుతుంది.