KTR Anand Maheendra: కేటీఆర్ .. మరోసారి మనసు దోచేశాడట.!

KTR Anand Maheendra: తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు   తన సరికొత్త ఆలోచనలతో  దూసుకెళ్తున్నాడు.  రాష్ట్రానికి కార్పొరేట్, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రప్పించే విషయంలో ముందున్నారు.  ప్రస్తుత ఐటీ విధానం పంథాలోనే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చేలా తన మార్కు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.   ఐటీ సెక్టార్ లో  ప్రపంచ దేశాల  దృష్టిని ఆకర్షిస్తున్న మంత్రి కేటీఆర్ పై మహీంద్రా గ్రూప్ ఓనర్ ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు […]

Written By: NARESH, Updated On : January 18, 2022 2:18 pm
Follow us on

KTR Anand Maheendra: తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు   తన సరికొత్త ఆలోచనలతో  దూసుకెళ్తున్నాడు.  రాష్ట్రానికి కార్పొరేట్, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రప్పించే విషయంలో ముందున్నారు.  ప్రస్తుత ఐటీ విధానం పంథాలోనే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చేలా తన మార్కు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.   ఐటీ సెక్టార్ లో  ప్రపంచ దేశాల  దృష్టిని ఆకర్షిస్తున్న మంత్రి కేటీఆర్ పై మహీంద్రా గ్రూప్ ఓనర్ ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు కురిపించారు. త‌న చిర‌కాల స్వప్నాన్ని నిజం చేసినందుకు కేటీఆర్‌కు ధ‌న్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

ఫార్ములా ఈ-రేస్ ను తెలంగాణ ఫార్ములా  వన్ కు  ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ పోటీలకు హైదరాబాద్ వేదిక  ఇవ్వనుంది.  ఇప్పటికే పారిస్, రోమ్, లండన్, హాంకాంగ్, న్యూయార్క్, బెర్లిన్ తదితర 18 నగరాలు ఉండగా.. మరో 60 నగరాలతో పోటీపడి కొత్త వేదికగా భారత్ నుంచి తొలిసారిగా హైదరాబాద్ దక్కించుకుంది. నవంబరు 22 నుంచి ఫిబ్రవరి వరకు ఫార్ములా ఈ-రేసు పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

హైదరాబాద్ లో జరిగే పోటీల తేదీలను త్వరలోనే నిర్వాహకులు ప్రకటిస్తారని కేటీఆర్ చెప్పారు.  దీని కోసం సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, హుస్సేన్నాగర్ చుట్టూ 2:37 కిలోమీటర్ల ఈ రేసింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వాడకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించే నిర్ణయం తీసుకున్నామన్నారు. పినాకిల్ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పేరిట జరిగే పార్ములా హైదరాబాద్ ను వేదికగా ఎంపిక చేస్తూ అంతర్జాతీయ వాహన సమాఖ్య  ఫార్ములా – ఈతో  రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్ములా-ఈ సహ వ్యవస్థాపకుడు. ఛీప్ చాంపియన్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో ప్రమోటర్,  గ్రీన్కో సంస్థ సీఈవో అనిల్ చలమలశెట్టి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్  కుమార్ లు  ఈ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.  దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.

ఈ రేసింగ్ నిర్వణపై   ఆనందర్  మహీంద్రా  తన సంతోషం వ్యక్తం చేశారు.   సొంత గడ్డపై తన టీమ్ కార్లను రేసింగ్లో చూడాలనే కోరికకు మంత్రి కేటీఆర్ పరోక్షంగా తీరుస్తున్నట్లు కొనియాడారు..  గతంలో టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు కేటీఆర్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ సీపీ గుర్నానీ తడవకుండా గొడుగు పట్టారు. ఇది మహీంద్రా గ్రూప్ చైర్మన్ ను ఆనందపరిచింది.   ఇప్పుడు రేసింగ్ విషయంలో మరోసారి అభినందనలు అందుకున్నారు.

-శెనార్తి