Sana Mir: ఇండియన్ క్రికెట్ టీమ్ మీద ఎన్ని సార్లు ఓడిపోయిన కూడా పాకిస్తాన్ ప్లేయర్లు గాని ఆ దేశపు జనాలు కానీ ఎప్పుడు దేశం మీద విషాన్ని కక్కుతూనే ఉంటారు… ఎప్పటికప్పుడు వాళ్లకి మనవాళ్లు సమాధానం చెప్పినప్పటికి వాళ్ల వైఖరి మాత్రం మారడం లేదు. రోజురోజుకీ ఇంకా వాళ్ళు ప్రవర్తించే తీరు చాలా చండాలంగా ఉంటుందని చాలామంది ప్లేయర్లను విమర్శిస్తున్నారు… రీసెంట్ గా ఆసియా కప్ లో పాకిస్తాన్ ప్లేయర్లు ఇండియా మీద చేసిన కొన్ని వ్యాఖ్యల మీద, అనుసరించిన విధానాల మీద తీవ్రమైన విమర్శలైతే ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఇండియా ఆసియా కప్ గెలిచి పాకిస్థాన్ కి గట్టి పోటీ ఇచ్చింది… ఇప్పుడు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో అక్టోబర్ రెండోవ తేదీన పాకిస్తాన్ బంగ్లాదేశ్ టీమ్ ల మధ్య మ్యాచ్ జరిగింది.
అందులో పాకిస్తాన్ మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ అయిన సానా మీర్ ఆ మ్యాచ్ కామెంటేటర్ గా వ్యవహరించారు…ఇక ఈ సమయంలోనే ఆమె ఇండియాను ఉద్దేశిస్తూ కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలైతే చేశారు. పాకిస్తాన్ ప్లేయర్ అయిన ‘నటాలియా పర్వీజ్’ బ్యాటింగ్ కి వస్తున్నప్పుడు ఆమెను ఉద్దేశిస్తూ ‘నటాలియా ఆజాద్’ కాశ్మీర్ కు చెందిన అమ్మాయి అని…
లాహోర్ కి వచ్చి ఇక్కడ పాక్ మహిళా జట్టులో రాణిస్తోంది అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి…ఇక నటాలియా పర్వేజ్ భీంబర్ జిల్లా కి చెందిన అమ్మాయి…ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉందని సన మీర్ చెప్పింది.దాంతో ఆమె ఇండియా ను తక్కువ చేసి మాట్లాడిందని ఆమె మీద ప్రతి ఒక్కరు ఫైర్ అవుతున్నారు…
ఆమె మాటల మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం తో సన మీర్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ నేను రాజకీయ కోణం లో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కేవలం నటాలియా కాశ్మీర్ నుంచి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిందనే విషయాన్ని తెలియజేయడానికే నేను అలా మాట్లాడని చెప్పింది…ఇక మొత్తానికైతే ఆమె ఇప్పటికి సారీ చెప్పకపోవడం ప్రతి ఒక్క ఇండియన్ ను ఆగ్రహానికి గురి చేస్తోంది…