Vinod Kambli: టీమ్ ఇండియాలో సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువగా పేరు తెచ్చుకోవలసిన వినోద్ కాంబ్లీ నేడు మంచానికి పరిమితమయ్యాడు. బ్యాటింగ్ లో అదరగొట్టే అతడు క్రమశిక్షణను పాటించకపోవడంతో త్వరలోనే అంతర్దానమయ్యాడు. ఎంత వేగంగానైతే పైకి ఎదిగాడో.. అంతే వేగంగా కిందికి పడిపోయాడు.. అతడు ఆడిన 17 టెస్టులు, 104 వన్డేలలో 3,561 పరుగులు చేశాడు. అయితే దూకుడు అయిన వ్యక్తిత్వం.. వివాదాల జోలికి వెళ్లే మనస్తత్వం వల్ల త్వరగా నే తన కెరియర్ కు వినోద్ కాంబ్లీ వీడ్కోలు పలికాడు. జట్టులో సుస్థిరమైన స్థానాన్ని కలిగి ఉండి.. అనేక రికార్డులు సాధించాల్సిన చోట.. అంతర్దానమైపోయాడు.
మద్యానికి అలవాటు పడి..
వినోద్ కాంబ్లీ మద్యానికి అలవాటు పడ్డాడు. క్రమశిక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. వివాదాలలో తల దూర్చడం ప్రారంభించాడు. మద్యానికి తోడు సిగరెట్లు కూడా కాల్చడం.. పద్ధతి లేని ఆహారపు అలవాట్ల వల్ల వినోద్ కాంబ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. క్రమక్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. చివరికి ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడంతో కనీసం వైద్యం చేయించుకోలే ని దుస్థితికి పడిపోయాడు. ఈ క్రమంలో స్నేహితులు, ఇతర బంధువులు అతడిని థానే లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ఆసుపత్రిలో ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. తల మీద ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. మనిషి మొత్తం నల్లగా మారిపోయాడు. కనీసం అడుగు తీసి అడుగువేయలేని దుస్థితికి చేరుకున్నాడు. ఒకరు పట్టుకుంటే తప్ప నిలబడలేకపోతున్నాడు. అయితే అతడి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా.. జ్ఞాపకశక్తి తిరిగి పొందలేడని.. 80 శాతం మాత్రమే రికవరీ చేయగలమని వైద్యులు అంటున్నారు. వినోద్ కాంబ్లీ ని ఈ స్థితిలో చూసి ఒకప్పటి క్రికెట్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. గొప్పగా వెలుగొందాల్సిన ఆటగాడు.. ఇలా అయిపోయాడు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
క్రమశిక్షణ లేకపోవడంతో..
ఇటీవల రమకాంత్ విగ్రహాన్ని ముంబైలో ఆవిష్కరించారు. రమాకాంత్ వద్ద సచిన్, వినోద్ శిష్యరికం చేశారు. వీరిలో సచిన్ ఉన్నత స్థానాలకు ఎదిగాడు. ప్రపంచ క్రికెట్ ను దశాబ్దాల పాటు శాసించాడు. టికెట్ గాడ్ గా ఎదిగాడు. వినోద్ మాత్రం క్రమశిక్షణ లేకపోవడంతో త్వరగానే కనుమరుగయ్యాడు. చివరికి తీవ్ర అనారోగ్యంతో ఇలా మంచానికి పరిమితమయ్యాడు. స్నేహితుడికి చాలాసార్లు సచిన్ చెప్పి చూశాడు. అయిన వినోద్ పట్టించుకోలేదు. పైగా తన నిర్లక్ష్యాన్ని మరింత పెంచుకున్నాడు. దీంతో క్రికెట్ కు దూరమయ్యాడు. ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని.. మరెంతో ఉజ్వలమైన స్థానంలో ఉండాల్సిన అతడు.. క్రమేపి ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇటీవల వినోద్ ఉదంతాన్ని రాహుల్ ద్రావిడ్ ఉదాహరణలతో మరి చెప్పాడు. పృద్వి షా కు కూడా ఇదే వర్తిస్తుందని అతడు వివరించాడు.
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. థానే లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంబ్లీ జ్ఞాపక శక్తి కోల్పోయారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వీడియో క్రికెట్ ఫ్యాన్స్ కు ఆవేదన కలిగిస్తోంది. #Vinodkambli pic.twitter.com/xLMb8hlqjs
— Anabothula Bhaskar (@AnabothulaB) December 27, 2024