Mithun Manhas BCCI President: భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త అధ్యక్షుడు ఖరారు అయినట్టు తెలుస్తోంది. శనివారం జరిగిన హై ప్రొఫైల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ మండలికి రాజీవ్ శుక్లా తాత్కాలిక సారథ్యం వహిస్తున్నారు. ఇటీవల లోథా కమిటీ సిఫారసుల మేరకు రోజర్ బిన్నీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి శుక్లా భారత క్రికెట్ నియంత్రణ మండలికి తాత్కాలిక సారధిగా వ్యవహరిస్తున్నారు. అయితే త్వరలో భారత క్రికెట్ నియంత్రణ మండలికి అధ్యక్షుడిని నియమిస్తారని ఇటీవల కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. సచిన్, గంగూలీ, హర్భజన్ పేర్లు వినిపించినప్పటికీ .. అవి మొత్తం ఊహగానాలు గానే తేలిపోయాయి.
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం భారత క్రికెట్ నియంత్రణ మండలికి తదుపరి అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎంపికైనట్టు తెలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి హై ప్రొఫైల్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈయన ఢిల్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. భారత జాతీయ జట్టుకు రెండు టెస్టులు ఆడాడు. మిధున్ కు పోటీగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురాం భట్ ఉన్నారు. కానీ అయితే రఘురాం కోశాధికారి అయ్యే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి సౌరవ్ గంగూలీ లేదా హర్భజన్ సింగ్, సచిన్ భారత క్రికెట్ నియంత్రణ మండలికి కాబోయే అధ్యక్షులు అని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అదంతా ప్రచారమే అని తేలిపోయింది.
శనివారం రాత్రి కేంద్ర క్రీడా శాఖ మంత్రి నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మన్హస్, ప్రోగ్రాం పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాజీవ్ శుక్ల, దేవదత్ సైకియా, రోహన్ దేశాయ్, ప్రభ తేజ సింగ్ భాటియా, అరుణ్ సింగ్ ధూమల్ వంటి వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సౌరాష్ట్ర నుంచి బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా, పిసిసి మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, కాశీ విశ్వనాథన్, ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ మాజీ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వంటి వారు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి గంగూలీ, హర్భజన్ హాజరు కాకపోవడంతో వారిద్దరూ అధ్యక్ష పదవికి రేసులో లేరని అర్థమైంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆదివారం చివరి రోజు కావడంతో.. శనివారమే తప్పనిసరి సమావేశం నిర్వహించారు. 28న బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఆ రోజే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు. ఆదివారం మన్హాస్, రఘురాం నామినేషన్లు దాఖలు చేయడానికి ముంబై వెళ్లారు. అయితే తదుపరి కార్యవర్గంలో శుక్లా, సైకియా, భాటియా, దేశాయ్ పదవులలో కొనసాగుతారని తెలుస్తోంది. ధూమాల్ తన ఆరు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూల్ ఆఫ్ పీరియడ్ కు వెళ్లే అవకాశం ఉంది.
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మన్హాస్ పేరును నామినేట్ చేసింది. ప్రస్తుతం అతను అక్కడ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఢిల్లీ తరఫున అతడు 1507 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లలో ఆడాడు. 45 సగటుతో 9714 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ తరఫున 130 లిస్ట్ ఏ, 91 టి20 మ్యాచ్ లు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, పూనే వారియర్స్ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు.