Virat Kohli: ఐపీఎల్ లో భాగంగా ప్రతి ప్లేయర్ కూడా ఈ సీజన్ లో తమ టీమ్ కి ఎలాగైనా సరే కప్పుని అందించాలి అనే ఉద్దేశ్యం తోనే బరిలోకి దిగి చివరి వరకు వాళ్ళ పోరాట పటిమను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు ఆడిన అన్ని టీమ్ లు కూడా మంచి విజయాలను నమోదు చేసుకుంటూ వెళ్తున్నాయి. ఇక అందులో భాగంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ టీమ్ ల మధ్య మ్యాచ్ అయితే జరిగింది.
ఇక అందులో బెంగళూరు టీం విజయాన్ని సాధించింది ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో కోహ్లీ అభిమాని ఒకరు గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హగ్ చేసుకొని ఆయన కాళ్లు పట్టుకున్న విషయం మనకు తెలిసిందే.. అయితే ఇక అప్పటికే గ్రౌండ్ లోకి వచ్చిన ఆ గ్రౌండ్ సెక్యూరిటీ వాళ్లు కోహ్లీ అభిమానిని లాక్కొని వెళ్లారు. అలాగే వెళ్తూనే అతని మీద పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్ల తో తన్నుతూ ఆయన్ని గాయపరిచారు. ఇక వాళ్లు అతన్ని కొడుతున్న సమయంలో ఒక నెటిజన్ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
దీంతో అది చూసిన ప్రతి ఒక్కరు ఆర్సిబి పైన మండిపడుతున్నారు. ఒక అభిమాని తన అభిమాన క్రికెటర్ ని చూడడానికి వచ్చినప్పుడు సెక్యూరిటీ వాళ్లు ఇలా వ్యవహరించడం అనేది చాలా దారుణమైన విషయం అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక అభిమాని కూడా అలా గ్రౌండ్ లోకి దూసుకెళ్లడం అనేది సరైన విషయం కాదు.
కానీ దానికి కొట్టడం అయితే పరిష్కారం కాదు. ఆయన్ని బెదిరిస్తే బాగుండేది అంతే తప్ప ఆయన్ని కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… ఇక ఇది ఇలా ఉంటే బెంగుళూర్ టీమ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ఇక మరో మ్యాచ్ లో పరాజయాన్ని అందుకుంది.
The fan who obstructed the field to meet Virat Kohli was beaten up black and blue.
Thoughts?pic.twitter.com/BZ4SKI6f5d
— Sameer Allana (@HitmanCricket) March 27, 2024