https://oktelugu.com/

Neeraj Chopra : కలలో కూడా గోల్డ్ మెడల్ వస్తుందనే అంచనా ఉండేది కాదు.. అదిగో అప్పుడొచ్చాడు ఓ పసిడి వీరుడు…

టోక్యో ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శనతో నీరజ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే అతడి ప్రదర్శన గాలివాటమని, ఏవో అనుకూలమైన పరిస్థితులు కలిసి వచ్చి అతడు గోల్డ్ మెడల్ సాధించాడని ఆరోపించిన వారు లేకపోలేదు. అయితే వారందరి ఆరోపణలను తుత్తు నీయలు చేస్తూ నీరజ్ అనేక పోటీలలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 9, 2024 / 10:06 AM IST
    Follow us on

    Neeraj Chopra : అది 2021.. ఆగస్టు 7.. జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అప్పటిదాకా స్వతంత్ర భారతావనికి ఒలింపిక్స్ అథ్లెట్స్ లో ఒక గోల్డ్ మెడల్ కూడా లేదు. అసలు ఆ దిశగా ఏ ఆటగాడికి కూడా ఊహ ఉండేది కాదు. అదిగో అప్పుడొచ్చాడు ఓ పసిడి వీరుడు. బల్లెం చేతులకు తీసుకుని మెరుపు వేగంతో పరుగు అందుకున్నాడు. ఒక్కసారిగా విసిరాడు.. అంతే స్వర్ణం స్వప్నం నెరవేరింది. అద్భుతమైన కల కళ్ళముందు సాక్షాత్కారమైంది. పతకం తీసుకురమ్మంటే గోల్డ్ మెడల్ పట్టుకొచ్చాడు. దేశంలో పసిడి శతకానికి శ్రీకారం చుట్టాడు.

    2024 ఆగస్టు 8..

    2024 ఆగస్టు 8 అర్ధరాత్రి అతడు మళ్ళీ పారిస్ వేదికగా ఈటె పట్టుకున్నాడు. ఇప్పటివరకు నాలుగు కాంస్యాలు మాత్రమే రావడంతో.. అతడు కచ్చితంగా స్వర్ణం సాధిస్తాడనుకున్నారు.. అతడు విసిరిన ఈటె వేగంగా దూసుకెళ్లినప్పటికీ.. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దీంతో నీరజ చోప్రా రజతాన్నే బంగారం లాగా మలచుకున్నాడు. దీని వెనక అతడు ఎంతో శ్రమ పడ్డాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గాయాలను సవాల్ చేశాడు. అలుపు అనేది లేకుండా సాధన చేశాడు. అంచనాల భారం అతడిని ఒత్తిడికి గురి చేసినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఎప్పుడూ బెదరలేదు. తలకు రిబ్బన్ కట్టుకొని మైదానాలకు దిగి జావెలిన్ చేతుల్లోకి తీసుకొని.. గట్టిగా ఊపిరి తీసుకొని.. మెరుపు వేగంతో పరుగు మొదలు పెట్టడం.. శక్తిని మొత్తం భుజాల్లోకి తీసుకో.. ఈటె ను విసరడం.. పతకాలు పట్టడం.. ఇవే నీరజ్ ఒంట పట్టించుకున్నాడు.

    టోక్యో ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శనతో నీరజ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే అతడి ప్రదర్శన గాలివాటమని, ఏవో అనుకూలమైన పరిస్థితులు కలిసి వచ్చి అతడు గోల్డ్ మెడల్ సాధించాడని ఆరోపించిన వారు లేకపోలేదు. అయితే వారందరి ఆరోపణలను తుత్తు నీయలు చేస్తూ నీరజ్ అనేక పోటీలలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. జర్మనీ కోచ్ క్లాస్ బార్టో నిజ్ ఆధ్వర్యంలో తనను తాను మెరుగుపరుచుకున్నాడు. ఏ భారత అథ్లెట్ సాధించని ఘనతలను తన సొంతం చేసుకున్నాడు. పలు టోర్నీలలో గోల్డ్ మెడల్స్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. మన దేశం మొత్తం క్రికెట్ మానియాతో ఊగిపోతుంటే.. ఈ తరానికి జావెలిన్ లో కూడా భవిష్యత్తు ఉందని నిరూపించిన వాడు నీరజ్ చోప్రా. అతన్ని ఆదర్శంగా తీసుకోని రేపటి నాడు వేలాదిమంది ఈటెను పట్టుకుంటే ఆ ఘనత ముమ్మాటికి నీరజ్ చోప్రా దే.

    టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నీరజ్ చోప్రా బయటికి ప్రపంచానికి తెలిశాడు. తనలో ఒక క్రీడాకారుడు మాత్రమే కాకుండా.. ఒక మెంటార్ కూడా దాగి ఉన్నాడని నిరూపించాడు. భారత మహిళా క్రికెట్ జట్టుకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో.. కఠినమైన పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా మలుచుకోవాలో తన వ్యక్తిగత అనుభవాల ద్వారా వివరించాడు. వాటి ద్వారా తాము ఎంతో ప్రేరణ పొందామని.. గొప్పగా తమరు తాము తీర్చిదిద్దుకున్నామని మహిళా క్రికెటర్లు చెప్పారు. దీనినిబట్టి నీరజ్ చోప్రా ఎంతటి గొప్ప అథ్లెటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వెండి పతకం సాధించినప్పటికీ.. తన అంచనాల మొత్తం బంగారు పతకం చుట్టే తిరుగుతున్నాయని నీరజ్ చోప్రా చెబుతున్నాడు. అంటే అతని అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు