England Vs Australia 4th Test: యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టు కోలుకున్న విధానం అద్భుతమనే చెప్పాలి. మూడో టెస్ట్ లో విజయం సాధించడం ద్వారా సిరీస్ ఆశలను ఇంగ్లాండ్ నిలబెట్టుకుంది. గెలిస్తేనే నిలిచే అవకాశం ఉన్న నాలుగో టెస్ట్ లోను ఇంగ్లాండ్ జట్టు అదరగొడుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టును స్వల్ప స్కోర్ కి పరిమితం చేయడంతోపాటు బ్యాటింగ్ లోనూ ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టింది. దీంతో నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం దశగా సాగుతోంది.
యాషెస్ సిరీస్ అంటే చాలు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు చెలరేగిపోతుంటాయి. ఈ సిరీస్ కోసం కొన్ని నెలల ముందు నుంచే ఇరు జట్లు సన్నద్ధమవుతుంటాయి. ఈ సిరీస్ విజయం రెండు జట్ల కల మాత్రమే కాదు.. దేశ ప్రజల చిరకాల వాంఛ కూడా. అందుకు అనుగుణంగానే ఇరుజట్లు ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా భావించి ఆడుతుంటాయి. ఈ ఏడాది కూడా యాషెస్ సిరీస్ కొద్ది వారాల క్రితం ప్రారంభమైంది. మొదటి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించడంతో ఈసారి యాషెస్ ఆస్ట్రేలియా జట్టుదే అని అంతా భావించారు. అయితే, మూడో టెస్ట్ నుంచి ఇంగ్లాండ్ జట్టు పుంజుకున్న విధానం అద్భుతం అనే చెప్పాలి. మూడో టెస్ట్ లో మూడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి ఈ సిరీస్ లో తొలిసారి విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్ లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1 తగ్గించగలిగింది ఇంగ్లాండ్ జట్టు. మూడో టెస్టులో విజయం తర్వాత ఇంగ్లాండ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా జట్టుపై ఒత్తిడిని ఇంగ్లాండ్ పెంచింది. నాలుగో టెస్ట్ లో కూడా అదే ఒత్తిడిని కొనసాగిస్తూ ఇంగ్లాండ్ జట్టు సాగుతోంది.
నాలుగో టెస్ట్ లో ఆస్ట్రేలియాను చుట్టేసిన ఇంగ్లాండ్..
నాలుగో టెస్ట్ లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితిలో ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 162 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 317 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిష్ వోక్స్ ఐదు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించగా, బ్రాడ్ రెండు, జేమ్స్ అండర్సన్, మార్కువుడ్, మొయిన్ అలీ ఒక్కో వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసే అవకాశం లభించలేదు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేసిన చోట ఆస్ట్రేలియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్ బాల్ వ్యూహాన్ని ఈ టెస్టులో మరింత పకడ్బందీగా అమలు చేసినట్లు కనిపిస్తోంది. వచ్చిన ప్రతి బ్యాటర్ వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 592 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రావ్లే 189(182, మొయిన్ అలీ 54(82), రూట్ 84(95), హ్యారీ బ్రూక్ 61(100), స్టోక్స్ 51(74), బెయిర్ స్టో 99(81) పురుగులను అత్యంత వేగంగా చేయడంతో ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లో పట్టు బిగిస్తోంది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో హజల్ వుడ్ ఐదు పడగొట్టగా, స్టార్కు, గ్రీన్ రెండేసి వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్ లో 275 పరుగులు వెనకబడి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయింది. మూడో రోజు ముగిసే సమయానికి 113 పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 18(34), డేవిడ్ వార్నర్28(53), స్టీవెన్ స్మిత్ 17(38), హెడ్ 1(7) వికెట్లను కోల్పోయి ఆస్ట్రేలియా జట్టు ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో మార్నస్ లబుచేంజ్ 44(88), మిచెల్ మార్స్ 1(27) ఉన్నారు. నాలుగో రోజు ఆట ప్రారంభానికి వర్షం అంతరాయం కలిగించడంతో ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని ఎవరు ఆపలేని పరిస్థితిలో ఉంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే సిరీస్ 2-2 తో సమం అవుతుంది. దీంతో ఐదో టెస్ట్ అత్యంత ఉత్కంఠ గా మారనుంది.
Web Title: England vs australia ashes 4th test
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com