England vs Australia 2nd Test: యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగు రోజుల ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ జట్టు విజయానికి 257 పరుగుల దూరంలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్లు తీస్తే విజయాన్ని సాధిస్తుంది. రెండు జట్లు ఈ టెస్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆడుతుండడంతో విజయం ఎవరిని వరిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి ఈ సిరీస్ లో లీడింగ్ లో ఉంది. ఈ టెస్టులో విజయం సాధించడం ద్వారా సిరీస్ ను సమం చేయాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది.
ఇంగ్లాండు, ఆస్ట్రేలియా జట్టు మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఐదో రోజుకు చేరుకుంది. నాలుగు రోజుల ఆట ముగుసేసరికి ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. విజయానికి మరో 257 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే నాలుగు వికెట్లు తీసింది. ఇంగ్లాండ్ జట్టు 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినప్పటికీ ఆ జట్టును బెన్ డకెట్, బెన్ స్టోక్స్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అమూల్యమైన భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆటను ఇంగ్లాండ్ ముగించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఇంగ్లాండు జట్టు మాత్రం ఓవర్ కు 3.68 రన్ రేట్ తో పరుగులు చేయడం గమనార్హం.
అద్భుత బౌలింగ్ తో చుట్టేసిన ఆస్ట్రేలియా..
నాలుగో రోజు ఆస్ట్రేలియా జట్టు 279 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో 91 పరుగుల లీడ్ సంపాదించిన ఆస్ట్రేలియా జట్టు, రెండో ఇన్నింగ్స్ లో చేసిన 279 పరుగులతో కలిపి ఇంగ్లాండ్ జట్టుకు 370 పరుగుల లక్ష్యాన్ని విధించింది. 371 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు జట్టుకు ఆశించిన స్థాయిలో ఆటగాళ్ళు శుభారంబాన్ని ఇవ్వలేకపోయారు. 45 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు సులభంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే ఓపెనర్ బెన్ డకెట్ వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ పట్టుదలను కనబరిచాడు. నాలుగు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ తో కలిసి ఇన్నింగ్స్ ను సక్కగిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు ఆటగాళ్లు 69 పరుగుల ఐదవ వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లాండ్ జట్టును మళ్ళీ పోటీలోకి తీసుకువచ్చారు. ఇంగ్లాండ్ జట్టు విజయానికి మరో 257 పరుగుల దూరంలో ఉంది. ఐదో రోజైన ఆదివారం మొదటి సెషన్ వికెట్ పడకుండా ఇంగ్లాండు జట్టు కాపాడుకోగలిగితే విజయం దిశగా వెళ్లేందుకు అవకాశం ఉంది. వికెట్ పడితే మాత్రం వేగంగానే ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్ ముగించే అవకాశం ఉంది. క్రీజులో ఉన్న ఇద్దరు కాకుండా బెయిర్ స్టో మాత్రమే ఇంకా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మిగిలిన వాళ్లంతా బౌలర్లే కావడంతో ఆస్ట్రేలియా సులభంగా వారిని చుట్టేసే అవకాశం ఉంది. అస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, స్టార్క్ రెండేసి వికెట్లు తీశారు.
ఆస్ట్రేలియా జట్టును ఆదుకున్న ఆ నలుగురు..
ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో మెరుగైన స్కోర్ చేసిందంటే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కారణం. 187 బంతుల్లో 77 పరుగులు చేశాడు ఉస్మాన్ ఖవాజా. అలాగే డేవిడ్ వార్నర్ 76 బంతుల్లో 25, లబుచేంజ్ 51 బంతుల్లో 30 పరుగులు, స్టీవెన్ స్మిత్ 62 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు 370 పరుగులకు పరిమితమైంది. ఇలాంటి బౌలర్లలో బ్రాడ్ నాలుగు, జోస్ టంగ్ రెండు, రాబిన్షన్ రెండు, అండర్సన్, స్టోక్స్ ఒక్కో వికెట్ చప్పున తీసుకున్నారు.