Odi World Cup 2023: ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టీమ్ వరుస ఓటమిలను చవిచూస్తూ చాలా ఫేలవమైన పర్ఫామెన్స్ ని ఇస్తుంది.ఇక ఇలాంటి క్రమంలో ఇంగ్లాండ్ టీం వరల్డ్ కప్ కి ముందు ఒక స్ట్రాంగ్ టీమ్ గా ఉండేది ప్రతి టీం కూడా ఆ టీమ్ ని చూసి కొంతవరకు కంగుతినే వారు.ఇక ఈసారి కూడా టైటిల్ ఇంగ్లాండ్ కే వస్తుంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు ఎందుకంటే ఇంగ్లాండ్ టీమ్ అంతా స్ట్రాంగ్ టీమ్ గా కొనసాగుతూ వస్తుంది. ఇక ఇలాంటి టైం లో ఇంగ్లాండ్ , న్యూజిలాండ్ టీమ్ ల మీద ఆడిన మొదటి మ్యాచ్ లో ఓడిపోయి వరుసగా అదే బ్యాడ్ పర్ఫామెన్స్ ని ఇస్తు వస్తుంది.
అయితే ఈ టీం ఫెయిల్ అవ్వడాన్ని జీర్ణించుకోలేని ఇంగ్లాండ్ ప్లేయర్లు శ్రీలంక మీద మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టీం కెప్టెన్ అయిన జోస్ బట్లర్ మాట్లాడుతూ మేము మ్యాచులు ఓడిపోవడానికి కారణం మాకు వెదర్ అనేది సరిగా అనుకూలించకపోవడం పిచ్ కూడా అంత బాగా అనుకులించడం లేదు. అందువల్లనే మేము ఇలా వరుసగా మ్యాచ్ లు ఓడిపోతు వస్తున్నాం అసలు మ్యాచ్ ల మీద కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాం అన్నట్టుగా మాట్లాడటం జరిగింది.
అలాగే ఇంతకుముందు మ్యాచ్ లో ఓడిపోయినప్పుడు కూడా ఇండియన్ పిచ్ లు వాళ్లకు సరిగా అనుకూలించడం లేదన్నట్టుగా మాట్లాడారు. ఇది తెలుసుకున్న కొంతమంది ఇండియన్ సీనియర్ ప్లేయర్లు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలపైన కొన్ని కామెంట్లు చేశారు.రవి శాస్త్రి అయితే కామెంట్రీ చేస్తూనే ఇంగ్లాండ్ మ్యాచ్ లు గెలవాలంటే వాళ్ల టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ అవ్వాలి లేకపోతే వాళ్లు వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేరు అనే ఒక హాట్ కామెంట్లు చేయడం జరిగింది. నిజానికి ప్రతి టీం కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తూ సూపర్ గా ఆడుతుంటే ఇంగ్లాండ్ వాళ్ళు మాత్రం ఆడడం చేతకాక పిచ్ లు బాగాలేవు, వెదర్ మాకు అనుకూలించడం లేదు అంటూ మాట్లాడుతున్నారు.
నిజానికి ఇంగ్లాండు లో అయితే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో ఎవరికీ తెలియదు.కానీ వాళ్ల పిచ్ లు మాత్రం మంచివి మనవి మాత్రం కంఫర్ట్ లేని పిచ్ లు అని అంటారు. అది మన దగ్గర మాత్రం ఒక మాదిరిగా ఎండ అనేది ఉంటుంది. దానికి కూడా తట్టుకోని మ్యాచ్ లు ఆడ లేకపోతే ఇంకా వాళ్ళు ఏం ప్లేయర్లు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వరల్డ్ కప్ కి ముందు ఇంగ్లాండ్ టీమ్ ఒక బౌలింగ్ డిపార్ట్మెంట్ లో తప్ప బ్యాటింగ్ లో మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపించింది.
అలాంటి టీం ఇప్పుడు చతికలబడటాన్ని చూసిన చాలామంది మాజీ క్రికెటర్లు సైతం ఇంగ్లాండ్ ఫెయిల్యూర్ కి కారణం వాళ్ల ప్లేయర్లు మాత్రమే అని కామెంట్స్ చేస్తున్నారు. పిచ్ లు అనేవి ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి పిచ్ కి తగ్గట్టుగా మనం మ్యాచులు ఆడితేనే మనం మ్యాచ్ లు గెలుస్తాం, అంతే తప్ప ఈ పిచ్ మాకు అనుకూలంగా లేదు అని అనడం అనేది ఒక ప్లేయర్ యొక్క పిరికితనానికి సంకేతం అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఇక ఇంగ్లాండ్ టీమ్ ని మినహాయిస్తే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీములు కూడా ఇక్కడ అద్భుతాలను చేస్తున్నాయి అలాంటి సందర్భంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు మాకు సరైన పిచ్ లు ఇవ్వడం లేదు ఇక్కడ వెదర్ మాకు అనుకూలించడం లేదు అంటూ సాకులు చెబుతూ బీసీసీఐ ని నిందిస్తూ వాళ్ల ఓటమికి వాళ్లు తప్ప మిగతా వాళ్లే కారణం అన్నట్టుగా దూషిస్తున్నారు.ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చాలామంది ప్లేయర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ప్లేయర్లు ఇక్కడ ఇండియాలో చాలా వేడిగా ఉంది అని కామెంట్లు చేస్తుంటే మీరంతా వచ్చి ఇక్కడ ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడు ఈ ఎండ అనేది మీకు కనిపించలేదా అని ఇండియన్ టీం అభిమానులు వాళ్లకు సెటైర్లు వేస్తున్నారు…
ఇయాన్ మోర్గాన్ రిటైర్ అవ్వడం తో ఈ టీమ్ ని నడిపించే ప్లేయర్ ఎవరు అనేది కూడా వాళ్ళకి అంత క్లారిటీ రావడం లేదు. బట్లర్ కెప్టెన్ అయిన కూడా బట్లర్ దారుణం గా ఫెయిల్ అవుతూ పక్క వాళ్ళని దుషిస్తున్నాడు…