Odi World Cup 2023: వరుస ఓటములకి చెక్ పెట్టడానికి ఇంగ్లాండ్ టీమ్ భారీ ప్లాన్స్ తో బరిలోకి దిగబొతున్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ఆడిన 5 మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించి మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో ఘోరంగా ఓడిపోయి ఇండియా లో తన పరువును తీసుకుంటుంది.ఇక ఇలాంటి టైం లో ఈ టోర్నీ లో అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తు మంచి విజయాలను అందుకుంటున్న ఇండియన్ టీమ్ ని ఆడిస్తే ఇప్పటి వరకు పోగొట్టుకున్న పరువు మొత్తాన్ని మళ్ళీ తీసుకురావచ్చు అనే ఉద్దేశ్యం లోనే ఈ మ్యాచ్ ని ఇంగ్లాండ్ టీమ్ చాలా సీరియస్ గా తీసుకుంది…
ఇక ఇలాంటి క్రమం లో ఇంగ్లాండ్ టీమ్ ప్లేయర్లు అందరూ కూడా భారీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్లు వాళ్ల టీమ్ గురించి మాట్లాడుతూ క్రికెట్ కి పుట్టినిల్లు మా దేశం, మేమే తోపులం అని వాళ్లకు వాళ్ళు అనుకొని అవతలి టీమ్ లని చులకన మాట్లాడటం ఇంగ్లాండ్ టీమ్ కి అలవాటు కానీ ఇప్పుడు ఎదురవుతున్న వరుస ఓటములు వాళ్ల గర్వనికి ఒక గుణపాఠం అనే చెప్పాలి.
ఇక వీళ్ళ టీమ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా దారుణంగా ఫెయిల్ అవ్వడం ఆ టీమ్ వరుస ఓటములకు కారణంగా చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఈ టీమ్ లో ఉన్న ఒక్క ప్లేయర్ కూడా మ్యాచ్ కి సంభందించిన రెస్పాన్స్ బిలిటి ని తీసుకోవడం లేదు.సాధారణం గా ఒక టీమ్ లో ఒకరు ఫెయిల్ అవుతున్నారు అంటే కనీసం మిగితా ప్లేయర్ల లో ఒకరైన ఇద్దరైన మినిమం ఆ మ్యాచ్ విజయానికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉంది ఆ టీమ్ కేవలం 200 పరుగులు చేయడం లో కూడా దారుణం గా ఫెయిల్ అవుతుంది…
ఇక ఇలాంటి క్రమం లో ఇండియన్ టీమ్ ని ఓడిస్తాం అంటూ బట్లర్ సేన పగటి కలలు కంటుంది…ఇండియన్ టీమ్ ని ఓడించడం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి టీము ల వల్లే కాలేదు ఇంగ్లాండ్ వల్ల ఏం అవుతుంది అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు…
అయితే ఇంగ్లాండ్ మాత్రం జట్టు లోకి సామ్ కరణ్ ని తీసుకువచ్చి అద్బుతం చేయడానికి రెఢీ అవుతుంది…ఇండియన్ పిచ్ ల మీద కానీ ఇండియన్ టీమ్ ల మీదగాని సామ్ కరణ్ కి మంచి రికార్డ్ లే ఉన్నాయి కాబట్టి ఈసారి ఆయన తో మ్యాజిక్ చేయడానికి ఇంగ్లాండ్ టీమ్ ట్రై చేస్తుంది. ఒకసారి ఇంగ్లాండ్ టీమ్ ప్లేయింగ్ 11 ని చూసుకుంటే…
ఓపెనర్లు గా జానీ బెయిర్ స్ట్రో ,దావూద్ మలన్ ఉన్నారు.ఇక నెంబర్ త్రీ లో ఆడటానికి జో రూట్ ఉన్నాడు.అలాగే నెంబర్ ఫోర్ లో బెన్ స్టోక్స్ ఉన్నాడు. నెంబర్ ఫైవ్ లో హరీ బ్రూక్స్ గానీ లేదా లివింగ్ స్టన్ కానీ ఆడే అవకాశం ఉంది.ఇక నెంబర్ సిక్స్ లో జాస్ బట్లర్,నెంబర్ 7 లో మోయిన్ అలీ,నెంబర్ ఎయిట్ లో సామ్ కరణ్,నెంబర్ నైన్ అదిల్ రషీద్, నెంబర్ 10 లో మార్క్ వుడ్, నెంబర్ 11 లో డేవిడ్ విల్లే తో ఇంగ్లాండ్ టీమ్ బరిలోకి దిగుతోంది… ముఖ్యంగా లక్నో పిచ్ మీద ఈ టోర్నీ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో కూడా గెలిచిన మూడు టీమ్ లు బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉన్న టీములు కావడం విశేషం…అందుకే ఇంగ్లాండ్ కూడా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ స్ట్రాంగ్ గా దిగుతుంది…