England Daddy: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ లాంటిది. ఈ ఆటను నువ్వా నేనా అన్నట్టుగా ఆడాలి. పోటీ తత్వాన్ని నిత్యం ప్రదర్శించాలి తోటి ప్లేయర్లను గౌరవించాలి. కేవలం ఆట ద్వారా మాత్రమే వారిపై పై చేయి సాధించాలనుకోవాలి. అంతేతప్ప ఇష్టానుసారంగా వ్యవహరించి జెంటిల్మెన్ గేమ్ కు చెడ్డ పేరు తీసుకురావద్దు.
సమకాలీన క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టు క్రికెట్ అద్భుతంగా ఆడుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. స్వదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లు ప్రత్యర్థి జట్లకు బీభత్సమైన పోటీ ఇస్తుంటారు. కొన్ని సందర్భాలలో మిగతా అన్ని సందర్భాలలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇతర జట్ల మీద అప్పర్ హ్యాండ్ కొనసాగించాలని భావిస్తుంటారు. పైగా ప్రతి సందర్భాన్ని కూడా తమకు అడ్వాంటేజ్ గా మార్చుకుంటారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. గడచిన మూడు సీజన్లుగా యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టుకు ఏమాత్రం గెలిచే అవకాశం ఇవ్వడం లేదంటే ఆస్ట్రేలియా జట్టు ఎలా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా యాషెస్ సిరీస్ కొనసాగుతోంది. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ నడిచింది. ఇందులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 40 పరుగుల లీడ్ సాధించింది. కానీ ఆ తర్వాత మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది.ఇంగ్లాండ్ జట్టుకు ఆస్ట్రేలియా చుక్కలు చూపించింది. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ విపరీతమైన పోరాటాన్ని ప్రదర్శించాడు. టి20 మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. ద్వారా ఐదు రోజుల మ్యాచ్ ను రెండు రోజుల్లోనే ముగించాడు. ఊహించని ఓటమి ఇంగ్లాండ్ జట్టును పూర్తిగా కుంగదీసింది.
ఈ విజయాన్ని పురస్కరించుకొని ది వెస్ట్ ఆస్ట్రేలియా అనే పత్రిక హెడ్ ను హీరోని చేసింది అంతేకాదు England’s daddy అనే దిక్కుమాలిన శీర్షిక పెట్టి వార్తను ప్రచురించింది. ఒక మ్యాచ్లో వీరవిహారం చేసినంత మాత్రాన హెడ్ హీరో కావచ్చు. కానీ అతడేమీ ఇంగ్లాండ్ జట్టుకు డాడీ కాదు. డాడీ అనేది చాలా గౌరవమైన పదం. ఆ పదాన్ని ఎలా వాడాలో కూడా ఆస్ట్రేలియా మీడియాకు తెలియక పోవడం అత్యంత దారుణం. ఈ ధోరణి చూస్తుంటే ఆస్ట్రేలియా ప్లేయర్లకే కాదు, ఆస్ట్రేలియా మీడియాకు సైతం ఒంటి నిండా కొవ్వేనని అర్థమవుతోంది.