https://oktelugu.com/

ENG vs IND 3rd ODI: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఫైనల్ గెలుపు ఎవరిది?

ENG vs IND 3rd ODI: ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ ప్రారంభం అయింది. కొద్ది సేపటి క్రితమే టాస్ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లో లాగేనే ఫీల్లింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్ లో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరం కావడం ఆందోళన కలిగించే అంశమే. దీంతో ఇంగ్లండ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 17, 2022 / 05:18 PM IST
    Follow us on

    ENG vs IND 3rd ODI: ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ ప్రారంభం అయింది. కొద్ది సేపటి క్రితమే టాస్ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లో లాగేనే ఫీల్లింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్ లో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరం కావడం ఆందోళన కలిగించే అంశమే. దీంతో ఇంగ్లండ్ ను ఏ మేరకు టీమిండియా అడ్డుకుంటుందో చూడాల్సిందే. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు.

    ENG vs IND 3rd ODI

    మూడో వన్డే ఇరు జట్లకు కీలకం. సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాలి. అందుకే రెండు జట్లు విజయంపై కన్నేశాయి. ఇప్పటికే ఇండియా టీ 20 సిరీస్ కైవసం చేసుకోవడంతో దానికి బదులు తీర్చుకోవాలని ఇంగ్లండ్ సేన ఉవ్విళ్లూరుతోంది. టీ20 తోపాటు వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకోవాలని ఇండియా భావిస్తోంది. ఇరు జట్ల పోరాటంలో చివరకు ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తెలియడం లేదు. ఈ మేరకు రెండు జట్లలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకుని జయకేతనం ఎగురవేయాలని తాపత్రయపడుతున్నాయి.

    Also Read: Mehreen Pirzada: 26 ఏళ్ళ హీరోయిన్ తో బాలయ్య – వెంకీ రొమాన్స్.. మధ్యలో రవితేజ కూడా !

    తొలి వన్డేలో ఆరు, రెండో వన్డేలో రెండు వికెట్లు తీసి జట్టుకు అండగా నిలిచిన బౌలర్ బుమ్రా ప్రస్తుతం దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. అతడి స్థానంలో హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకోవడంతో అతడు ఏ విధంగా రాణిస్తాడో అని అభిమానులు చూస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఇక ఇందులో విజయమే కీలకం కావడంతో ఇరు జట్లు చెమటోడ్చనున్నట్లు తెలుస్తోంది. కప్ గెలవాలని అటు టీమిండియా ఇటు ఇంగ్లండ్ లు ఎదురోడుతున్నాయి.

    ENG vs IND 3rd ODI

    టీమిండియాకు మరో లోటు విరాట్ కోహ్లి. కొద్ది కాలంగా అతడు ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. దీంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సిరీస్ తరువాత కొన్ని రోజులు సెలవు తీసుకుని వెకేషన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అతడి ఫామ్ పై అందరికి నమ్మకం ఉన్నా తన ప్రదర్శన బాగుండటం లేదని యాజమాన్యం గుర్తించింది. విరాట్ ను మొత్తానికి ఆట నుంచే తీసేస్తారనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ లోనైనా విరాట్ తన బ్యాట్ ఝళిపించాలని అభిమానులు ఆశ పడుతున్నారు. మొత్తానికి టీమిండియా, ఇంగ్లండ్ జట్లకు దేనికి అదృష్టం ఉందో తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే మరి.

    Also Read:Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి ఎంపికలో బీజేపీ చేసిన ఆలోచనమేమిటీ?

    Tags