Eng Vs Aus Ashes 2025: జెంటిల్మెన్ గేమ్ అని క్రికెట్ కు పేరుంది. ఎంతటి గొప్ప క్రీడ అయినప్పటికీ.. డబ్బులు వస్తేనే మేనేజ్మెంట్లు మ్యాచ్ లు నిర్వహిస్తాయి. స్పాన్సర్లతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం మేనేజ్మెంట్ లు నడుచుకుంటాయి. ఇందులో ఒప్పందానికి వ్యతిరేకంగా ఏది జరిగిన సరే మేనేజ్మెంట్లు నష్టపోవాల్సి ఉంటుంది. అందువల్లే క్రికెట్ మేనేజ్మెంట్ లు అన్నీ కూడా పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటాయి.. ముఖ్యంగా మ్యాచులు నిర్ణిత వ్యవధిలో మాత్రమే పూర్తి కావాలని భావిస్తుంటాయి.
ఏ ఆటగాడు అయినా సరే అద్భుతంగా ఆడాలని కోరుకుంటాడు.. మేనేజ్మెంట్లు కూడా అలానే భావిస్తుంటాయి.. అద్భుతంగా ఆడే క్రమంలో ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తే చూసే ప్రేక్షకులకు ఇంపుగానే ఉంటుంది. కానీ మేనేజ్మెంట్లకే అది ఇబ్బందికరంగా ఉంటుంది.. ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్లో ఇది మరింత ఇబ్బందికరంగా ఉంటుంది.. ఆ అనుభవం ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ కు ఎదురయింది. ప్రసిద్ధ యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం కంగారు దేశం వేదికగా తలపడుతున్నాయి. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ లో తలపడ్డాయి.. హోరాహోరిగా సాగాల్సిన ఈ మ్యాచ్ వన్ సైడ్ అయింది.. ఆస్ట్రేలియా జట్టు రెండవ ఇన్నింగ్స్ లో వీర విహారం చేసింది.. తద్వారా ఈ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసింది.
ఇంగ్లాండ్ జట్టు విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేసింది. ముఖ్యంగా హెడ్ టి20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. వీర విహారం చేసి ఇంగ్లాండు బౌలింగ్ మొత్తాన్ని తునాతునకలు చేసాడు. దీంతో రెండు రోజుల్లోనే తొలి టెస్ట్ ముగిసింది.. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టుకు ఐదు టెస్టుల సిరీస్లో లీడ్ లభించింది.. అయితే ఆస్ట్రేలియా ఇలా ఏకచత్రాధిపత్యం సాధించడం అభిమానులకు గొప్పగానే ఉన్నప్పటికీ.. మేనేజ్మెంట్ కు మాత్రం ఇబ్బందికరంగా ఉంది.
ఐదు రోజుల టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే పూర్తి కావడంతో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ కు భారత కరెన్సీలో దాదాపు 17.35 కోట్ల నష్టం వాటిల్లింది. ఎందుకంటే స్పాన్సర్లతో ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ ఐదు రోజులకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే రెండు రోజుల్లోనే మ్యాచ్ పూర్తి కావడంతో.. ఆ రోజులకు మాత్రమే స్పాన్సర్లు డబ్బులు చెల్లించారు. దీంతో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ నష్టపోయింది.. మరోవైపు సెంచరీ చేసిన తర్వాత, ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత హెడ్ విలేకరులతో మాట్లాడుతూ.. మ్యాచ్ త్వరగా ముగిసినందుకు అభిమానులు తనను క్షమించాలని కోరాడు.