T20 world cup for blind :ఐసీసీ నిర్వహిస్తున్న మెగా టోర్నీలలో టీమిండియా విజయ యాత్ర కొనసాగుతోంది. 2024లో పురుషుల జట్టు టి20 వరల్డ్ కప్ సాధించింది. 2025లో పురుషుల జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఇదే ఏడాది భారత్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ జాబితాలో భారత మహిళా andhuls క్రికెట్ జట్టు కూడా చేరింది..
ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన టి20 అంధుల క్రికెట్ వరల్డ్ కప్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఆదివారం శ్రీలంకలోని కొలంబో లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నేపాల్ జట్టును ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. ట్రోఫీని సాధించి సగర్వంగా నిలిచింది. ఈ టోర్నీలో పాకిస్తాన్, అమెరికా, ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి జట్లు పోటీపడ్డాయి. ఈ జట్లను ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. నేపాల్ జట్టును 114 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత టార్గెట్ ఫినిష్ చేయడంలో టీమిండియా దూకుడు కొనసాగించింది. కేవలం 12 ఓవర్లలోనే 117 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో టీమ్ ఇండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంతేకాదు దూకుడు అయిన ఆట తీరు కొనసాగించి తొలి ప్రపంచకప్ సాధించింది.. భారత జట్టులో పూల సరెన్ (44) టాప్ స్కోరర్ గా నిలిచింది. నేపాల్ జట్టు తరఫున సరిత (35) అత్యధిక పరుగులు చేసింది. ఈ టోర్నీ ని శ్రీలంక, భారత్ సంయుక్తంగా నిర్వహించాయి. ఫైనల్ మ్యాచ్ ను శ్రీలంకలో అత్యంత పురాతనమైన శరవణ స్టేడియంలో నిర్వహించారు.
అంధుల క్రికెట్ నిబంధనలు విభిన్నంగా ఉంటాయి. ఇది సాధారణ క్రికెట్ కంటే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.. మ్యాచ్ల కోసం ఉపయోగించే బంతి లోపల బేరింగ్ లు ఉంటాయి. పైగా ప్లాస్టిక్ తో రూపొందించి ఉంటాయి. బంతి దొర్లుతున్నప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని గ్రహించి ప్లేయర్లు ముందుకు వెళ్తారు. పైగా బంతిని అండర్ ఆర్మ్ అనే విధానంలో విసిరాలి. బౌలర్ బంతి వేసే క్రమంలో బ్యాటర్ ను సిద్ధంగా ఉన్నావా అంటూ అడగాలి. పైగా బంతిని విసురుతున్నప్పుడు “ప్లే” అని గట్టిగా అరవాలి.
అంధుల క్రికెట్ ఆడే జట్టులో 11 మంది ప్లేయర్లు ఉంటారు. ఇందులో కనీసం నలుగురు ఆటగాళ్లు పూర్తిగా చూపు లేని వారు ఉండాలి. వీరిని బి వన్ కేటగిరి ప్లేయర్లు అంటారు. ఆటలో పారదర్శకత కచ్చితంగా ఉండాలి. దానికోసం ప్లేయర్లు కాళ్లకు గంతలు ధరిస్తారు. బీ1 కేటగిరి లో ఉన్న ప్లేయర్లలో ప్రతి ఆటగాడు చేసిన పరుగును రెండు రెట్లు (డబుల్) లెక్కిస్తారు. అదే ఈ ఆటలో ప్రత్యేకత. మరోవైపు ఫీల్డర్లు తమ స్థానాలను ఇతర ప్లేయర్లకు వివరించడానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతుంటారు.. కాగా, అంధుల టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలిచిన నేపథ్యంలో ప్రశంసలు లభిస్తున్నాయి.
INDIA WON THE WORLD CUP
– India Women’s team won the World Cup for Blind. [Vipul Kashyap] pic.twitter.com/JTnoGlDL9J
— Johns. (@CricCrazyJohns) November 23, 2025