India Vs Australia Final 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం ఆస్ట్రేలియా టీమ్ లా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇక ఇప్పటికే రెండు టీముల మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఏ టీమ్ విజయం సాధిస్తుంది అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆస్ట్రేలియా టీమ్ ఇపుడున్న సిచువేషన్ ని బట్టి చూస్తే చాలా స్ట్రాంగ్ టీమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన కూడా వరుసగా ఏడు విజయాలను సొంతం చేసుకొని సెమీ ఫైనల్ లోకి అడుగు పెట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ టీమ్ బలం ఏంటి అనేది…
ఇక ఈ టోర్నీ లో ఇండియన్ టీం చేతిలో ఆస్ట్రేలియా లీగ్ దశలో ఓడిపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్ గా తయారయింది. ఇక సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా టీమ్ ని చిత్తు చేసి ఆస్ట్రేలియా భారీ అంచనాలతో ఎనిమిదోవ సారి ఫైనల్ లోకి అడుగు పెట్టింది.ఇక దాంతో ఇండియన్ టీం కూడా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతుంది. కాబట్టి ఈ రెండు టీమ్ లా మధ్య జరిగే పోటీని చూడడానికి ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు అందరిలో ఇంట్రెస్ట్ ని కలిగిస్తుంది.ఇక సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా టీం సౌతాఫ్రికా మీద జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా స్పిన్నర్లని ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు చాలా ఇబ్బంది పడ్డారు.
ఆ ఉద్దేశ్యం తోనే ఇక ఇండియన్ టీమ్ లో కూడా రవీంద్ర జడేజా, కుల్దిప్ యాదవ్ లాంటి స్పిన్నర్లు ఉన్నప్పటికీ టీమ్ లోకి ఆరొవ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ ని కూడా తీసుకుంటే బాగుంటుంది. ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల తో బరిలోకి దిగితే ఇండియన్ టీమ్ కచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలుస్తుందని చాలామంది సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఆరో నెంబర్ లో బ్యాటింగ్ చేసే సూర్య కుమార్ యాదవ్ కి బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రావడం లేదు. ఒకవేళ బ్యాటింగ్ అవకాశం వచ్చిన దానిని ఆయన పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
ఇక మన టాప్ 5 ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ అవసరం కూడా టీమ్ కి పెద్దగా ఉండటం లేదు. ఇక చివర్లో కొన్ని పరుగులు చేయాల్సి వస్తే అశ్విన్ కూడా ఆల్ రౌండర్ ప్లేయరే కాబట్టి ఆయన కూడా పరుగులు చేయగలడు. ఇక దీన్ని దృష్టి లో ఉంచుకొని టీమ్ లోకి అశ్విన్ ని తీసుకు వస్తే బాగుంటుంది.
అలాగే అశ్విన్ తన మ్యాజిక్ తో క్రీజ్ లో పాతుకు పోయిన బ్యాట్స్ మెన్స్ ని కూడా బోల్తా కొట్టించగలడు. కాబట్టి ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయాలంటే ఇపుడున్న పరిస్థితిలో అశ్విన్ కరెక్ట్ అని పలువురు మాజీ ప్లేయర్లు కూడా తెలియజేస్తున్నారు…ఇక ముఖ్యంగా మాక్స్ వెల్ లాంటి హిట్టర్ ని అశ్విన్ తన బౌలింగ్ తో బోల్తా కొట్టిస్తాడు.ఇక ఇలాంటి క్రమంలోనే అశ్విన్ టీంలోకి వస్తే ఇండియన్ టీమ్ బౌలర్ల మీద కూడా ఇంత ప్రేజర్ ఉండదు.ఇక ఆస్ట్రేలియా లాంటి బలమైన టీం కి ఫైనల్స్ ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. వాళ్ళు మిగితా మ్యాచ్ లు ఎలా ఆడిన కూడా ఫైనల్స్ అంటే మాత్రం రెచ్చిపోతారు…
కాబట్టి వాళ్ళని ఓడించాలంటే మన బౌలింగ్ టీం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి… కొద్దిగా తడబడిన కూడా ఆస్ట్రేలియా మన మీద పై చేయి సాధించే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాళ్ళని మొదటి నుంచే కట్టడి చేసుకుంటూ రావాలి. ముందుగా వాళ్ల బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేస్తేనే వాళ్ళ బౌలర్లను మన బ్యాట్స్ మెన్స్ ఈజీగా ఎదుర్కోగలుగుతారు…