Suryakumar Yadav: టీమిండియాలో ఇప్పుడు ప్రధాన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ జీవితం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. 2012లో టీ 20 లీగ్ లోకి ప్రవేశించినా 2015లో సరైన గుర్తింపు వచ్చింది. అదే ఏడాది కోల్ కత తరఫున ఆడి 20 బంతుల్లో 5 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అప్పటి వరకు దేశవాళీ క్రికెట్ లో ఎంత రాణించినా రాని పేరు ఒక్క ఇన్నింగ్స్ తో వచ్చింది. తనతోపాటు ఆడిన కేఎల్ రాహుల్, అక్షర పటేల్, బుమ్రాలు ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంటే తనకు మాత్రం అవకాశం రావడం లేదని కుంగిపోయేవాడు. ఈ దశలో భార్య సూర్యకు హితోపదేశం చేసింది. నువ్వు క్రికెట్ పైనే దృష్టి పెట్టు అని సలహా ఇచ్చింది. దీంతో సూర్య రెచ్చిపోయాడు.
2016 నవంబర్ లో ఉత్తరప్రదేశ్ తో రంజీ మ్యాచ్ జరుగుతోంది. ముంబయి ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. ఈ దశలో సూర్య 99 పరుగులు చేసి ముంబయి గౌరవప్రదమైన స్కోరు 233 చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ 91 పరుగులు చేయడం గమనార్హం. అదే సమయంలో కోల్ కత తరఫున టీ 20 మ్యాచ్ లో ఆడి వైస్ కెప్టెన్ అయ్యాడు. 2018లో మెగా వేలంలో ముంబయి ఇండియన్స్ సూర్యను రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబయి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు.
Also Read: Acharya Effect: ఇంతకుముందు ఏ సినిమా ప్లాప్ కాలేదా ? ఒక్క ఆచార్యకే ఎందుకు ఇలా ?
2021లో ఇంగ్లండ్ తో టీ 20 మ్యాచ్ లో ఆడే అవకాశం దక్కింది. దీంతో తన భార్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. సూర్య ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. అంతం కాదు అని ఆమె అన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరగలేదు. అరంగేట్ర మ్యాచ్ లోనే అదరగొట్టాడు. తొలి బంతినే సిక్సర్ గా మలిచి ఇంగ్లండ్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో సూర్య టీమిండియా జట్టుకు దొరికిన మరో ఆణిముత్యంలా మారాడు. ఇప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకోవడం గమనార్హం.
ప్రస్తుతం టీమిండియాలో మంచి ఫామ్ లో ఉన్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు. తాను కన్న కలలు నిజం చేసుకునే క్రమంలో ఎన్నోసార్లు బాధపడినా తన భార్య ఓదార్పు మాటలతో సూర్య తిరిగి పుంజుకున్నాడు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ నిత్యం జట్టు విజయంలో పాలు పంచుకుంటున్నాడు. భవిష్యత్ లో కూడా ఇంకా మంచి విజయాలు నమోదు చేసి టీమిండియాకు ఎదురులేదని నిరూపించేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:Visakhapatnam- CM Jagan: జగన్ బిచాణా ఎత్తేస్తున్నాడా? పాలన ఇక అక్కడ నుంచే?