India Vs Pakistan: ఇండియా పాకిస్తాన్ టీమ్ ల మధ్య ఇవాళ్ళ జరగనున్న మ్యాచ్ కి సర్వం సిద్దం గా ఉంది ఇక కొన్ని గంటల్లో జరగబోయే మ్యాచ్ ని చూడటానికి అభిమానులు అందరూ కూడా వేయి కన్నులతో ఎదురుచూస్తూ ఉంటారు.ఇక దీనికి తోడు ఇండియా పాకిస్తాన్ ని చిత్తు చేస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇక భారత అభిమానులకు మాత్రం ఇది నిజంగా కన్నుల పండగ అనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే ఈ ఒక్క మ్యాచ్ మీద ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మాత్రం ఈ ఒక్క మ్యాచ్ మీద దాదాపు 150 కోట్ల రూపాయలను సంపాదించబోతున్నట్టు గా తెలుస్తుంది..అంటే గత ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో వచ్చిన దానికన్నా ఈ సారి దాదాపు 50 కోట్లు ఎక్కువ గా వస్తుంది…ఇంత డబ్బు హాట్ స్టార్ వాళ్ళు ఎలా సంపాదిస్తారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
గత వన్డే వరల్డ్ కప్ ని ఆధారంగా చేసుకొని చెప్పుకున్నట్లైతే ఇంతకు ముందు వన్డే వరల్డ్ కప్ లో 10 యాడ్స్ స్లాట్స్ కి ఏకంగా 25 లక్షల రూపాయలను డిమాండ్ చేసింది. ఆ మ్యాచ్‌లో మొత్తం లో యాడ్ స్లాట్ సంఖ్య వచ్చేసి 5500 సెకన్లు ఇక వీటిద్వారా హాట్ స్టార్ దాదాపు 100 కోట్లకు పైన డబ్బులను బిజినెస్ రూపం లో జనాల దగ్గర నుంచి రాబట్టుకుందని తెలుస్తుంది…గత వరల్డ్ కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లో హాట్ స్టార్ 10 సెకన్ల యాడ్స్ కి దాదాపు 20 లక్షల వరకు డిమాండ్ చేసింది.అయితే భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ని ప్రపంచం లోని అందరూ అభిమానుల చూస్తారు కాబట్టి ఈ మ్యాచ్ కి అంత క్రేజ్ ఉంటుంది…నిజానికి ఈ మ్యాచ్ మీదనే విపరీతమైన బిజినెస్ లు జరుగుతుంటాయి…
ఇక ఈసారి జరిగే మ్యాచ్ లో డిస్నీ హాట్ స్టార్ వాళ్ళు విపరీతమైన ధనాన్ని అర్జించబోతున్నట్టు గా తెలుస్తుంది ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఒక్క మ్యాచ్ మీద 150 నుంచి 200 కోట్ల వరకు డబ్బులు సంపాదించే అవకాశం అయితే ఉంది. గతం కంటే కూడా ఇప్పుడు డిస్నీ హాట్ స్టార్ ప్రకటన స్లాట్‌లను పెంచడానికి సిద్ధంగా ఉంది.అంతకు ముందు 10 సెకనుల యాడ్ కోసం 20 లక్షలు డిమాండ్ చేయగా, ఇప్పుడు స్లాట్‌కు 30 నుండి 35 లక్షలను వసూలు చేస్తుందని తెలుస్తోంది. 2019 సంవత్సరంలో లాగా ఇప్పుడు కూడా 5500 సెకండ్లు అందుబాటులో ఉన్నట్టు గా తెలుస్తుంది.
ఈ ప్రపంచకప్ టోర్నమెంట్ ద్వారా బ్రాడ్‌కాస్టర్లు దాదాపు గా 1000 కోట్లు సంపాదించాలని ఆలోచన లో ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం గత వరల్డ్ కప్ కంటే కూడా ఇప్పుడు భారీ మొత్తం లో బిజినెస్ అనేది అవుతుంది.ఇక అందరి దృష్టి విక్రయదారులు, స్పాన్సర్ల పైనే ఉంది. క్రికెట్ అనే ఒక ఆట ని చూడటం వల్ల అంత మంది కి అన్ని వేల కోట్లలో లాభాలు వస్తున్నాయి అంటే నిజంగా మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరూ కూడా గ్రేట్ అనే చెప్పాలి…