https://oktelugu.com/

Dinesh Karthik: డీకే, మురళీ విజయ్ చీటింగ్ లొల్లి.. మైదానంలో ఫ్యాన్స్ గోల వైరల్

Dinesh Karthik: ఎవరు చేసుకున్న పాపం వారినే దహిస్తుంది. స్నేహితుడని నమ్మితే వాడి పెళ్లాన్నే తిరిగి పెళ్లి చేసుకోవడం క్షమించరాని నేరం. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఆంగ్లంలో చెబుతారు. ఏ ఆపద వచ్చినా సహకరించేది స్నేహితుడే. కానీ ఆ స్నేహితుడే పక్కలో బల్లెంలా మారితే ఇంకా ఏం చేసేది. కంచే చేను మేస్తే పరిస్థితి ఏంటి? ఎప్పటికైనా నమ్మినవాడికి ద్రోహం చేయడం సముచితం కాదు. కానీ ఇక్కడ జరిగింది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2022 / 05:33 PM IST
    Follow us on

    Dinesh Karthik: ఎవరు చేసుకున్న పాపం వారినే దహిస్తుంది. స్నేహితుడని నమ్మితే వాడి పెళ్లాన్నే తిరిగి పెళ్లి చేసుకోవడం క్షమించరాని నేరం. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఆంగ్లంలో చెబుతారు. ఏ ఆపద వచ్చినా సహకరించేది స్నేహితుడే. కానీ ఆ స్నేహితుడే పక్కలో బల్లెంలా మారితే ఇంకా ఏం చేసేది. కంచే చేను మేస్తే పరిస్థితి ఏంటి? ఎప్పటికైనా నమ్మినవాడికి ద్రోహం చేయడం సముచితం కాదు. కానీ ఇక్కడ జరిగింది అదే. స్నేహితుడని నమ్మితే మోసం చేశాడు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందట అన్నట్లు ఏదో హితుడు అని నమ్మితే అతడినే బురిడీ కొట్టించిన ఘనుడు సైతం ఉన్నాడనుకోండి.

    Dinesh Karthik

    క్రికెట్లో దినేశ్ కార్తీక్ గురించి తెలిసిందే. మంచి ఆటగాడు కావడంతో అతడికి టీమిండియాలో అవకాశాలు వచ్చేవి. అతడి ఫ్రెండ్ గా మురళీ విజయ్ కూడా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. కానీ మురళీ విజయ్ దినోశ్ కార్తీక్ మొదటి భార్య నిఖిత వంజరను ట్రాప్ చేసిన మురళీ ఆమెను పెళ్లి చేసుకోవడం సంచలనం కలిగించింది. దీంతో దినేశ్ కార్తీక్ పిచ్చోడిగా మారి మనసు స్థిమితంగా లేకపోవడంతో టీమిండియాకు సెలెక్ట్ కాకపోగా డిప్రెషన్ లో కి జారుకున్నాడు. కానీ అతడికి మరో దేవత కరుణించింది.

    Dinesh Karthik, Nikita Vanjara, Murali Vijay

    స్క్వాప్ క్రీడాకారిణి దీపిక దినేశ్ కార్తీక్ ను పెళ్లి చేసుకోవడంతో అతడి భవిష్యత్ కుదుట పడింది. ఇప్పుడు మంచి పొజిషన్ లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ టీమిండియా ఆటగాడు మురళీ విజయ్ రూబీ ట్రిక్కివారియర్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడు మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా ప్రేక్షకులు డీకే డీకే అంటూ గోల పెట్టారు. దీంతో మురళీ వారికి దండం పెడుతూ తనను అలా అనొద్దని వారించినా వినలేదు. దీంతో అతడికి అర్థమైంది. తాను చేసిన పాపమే తనను వెంటాడుతోందని గమనించి కామ్ గా ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

    Also Read: Bheemla Nayak Heroine: ‘భీమ్లా నాయక్‌’ హీరోయిన్ కి త్రివిక్రమ్ సపోర్ట్, కారణం ఏమిటి ?

    దినేశ్ కార్తీక్ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20లో ఊపు కనబరచాడు ప్రస్తుతం టీమిండియాకు కూడా ఎంపికయ్యే అవకాశాలు దగ్గర చేసుకుంటున్నాడు. మురళీ చేసిన నిర్వాకంతో నైరాశ్యంలోకి వెళ్లిన దినేశ్ ప్రస్తుతం ఫామ్ కొనసాగిస్తున్నాడు. త్వరలో జరిగే టీ 20 ప్రపంచ కప్ లోనూ అవకాశం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మేనేజ్ మెంట్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మురళీ చేసిన గాయంతో ఎక్కడికో వెళ్లిపోయిన దినేశ్ కోలుకోవడం నిజంగా అతడి అదృష్టమే.

    Also Read: TDP MP Ram Mohan Naidu: సిక్కోలు టీడీపీలో యువనేత చిచ్చు.. ఆ మార్పు వెనుక భారీ స్కెచ్

    Tags