Hardik Pandya: ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కప్ గెలుచుకుని అందరి అంచనాలను తలకిందులు చేసింది. అరంగేట్రం చేసిన మొదటి సారే కప్ గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా వ్యవహరించిన తీరు విమర్శకుల ప్రశంసలు పొందడం విశేషం. హార్థిక్ ఆటతీరుకు అందరు మంత్రముగ్గులయ్యారు. క్రికెట్ దిగ్గజాలు సైతం హార్తిక్ ఆటతీరుకు సంతోష పడ్డారు. జట్టును ముందుకు నడిపించడంలో వ్యూహాలు అమలు చేయడంలో అతడు చూపిన తెగువ ఓ చారిత్రాత్మకమే.
మహామహ జట్లే పోటీలో ఉండటంతో మొదటి సారి బరిలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ తన ప్రతిభతో కప్ గెలుచుకుంది. మెరుగైన ఆటతీరు ప్రదర్శించి ఫైనల్ లో రాజస్తాన్ రాయల్స్ ను మట్టికరిపించింది. దీంతో హార్థిక్ పాండ్యా మెలకువలు ఆటగాళ్లకు ఉపయోగపడ్డాయి. ఆయన ఆటగాళ్లను ముందుకు నడిపించడంలో పాండ్యా చూపిన మార్గమే ఆచరణీయమైంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ టైటాన్స్ అన్ని మ్యాచుల్లో అలవోకగా విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది.
Also Read: Imd- Monsoon: వర్షాల విషయంలో వాతావరణ శాఖ విరుద్ధ ప్రకటనలకు అర్థమేమిటో?
గతంలో హార్థిక్ పాండ్యా గాయం కారణంగా కొద్ది కాలం ఆటకు దూరమైనా తరువాత మళ్లీ ఫామ్ లోకి రావడం హర్షించదగినదే. ప్రస్తుతం భారత జట్టుకు కాబోయే కెప్టెన్ గా అభివర్ణిస్తున్నారు. వచ్చే ఏడాది రోహిత్ శర్మ 35 ఏళ్లు రావడంతో అతడిని కెప్టెన్ గా తప్పించడం ఖాయమే. అతడి స్థానంలో హార్థిక్ పాండ్యాకు చోటు దక్కుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన వాడిగా హార్థిక్ పాండ్యా ఆటతీరును అందరు వేనోళ్ల పొగిడారు. టీమిండియాకు మరో కపిల్ దేవ్ దొరికాడని చెబుతున్నారు. ఆల్ రౌండర్ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తనదైన శైలిలో రాణిస్తూ టీం విజయానికి బాటలు వేశాడు. హార్థిక్ పాండ్యా టీమిండియాకు దొరికిన ఆణిముత్యంలా భావిస్తున్నారు.
మొదట గుజరాత్ హార్థిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసుకోవడంతో అందరు జాలిపడ్డారు. గుజరాత్ బతికి బట్టకడుతుందా? కప్ గెలిచే సత్తా ఉందా అనే సందేహాలు అందరిలో వచ్చాయి. దీంతో అందరి వాదనలు పాండ్యా తలకిందులు చేశాడు. అద్భుతమైన ఆటతీరు కనబరచి మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతూ అతడు కూడా అటు బౌలింగ్ ఇటు బ్యాట్ తోనూ తానేమిటో చాటిచెప్పాడు. దీంతో హార్థిక్ పాండ్యా కాబోయే భారత జట్టు కెప్టెన్ గా భావించడంలో అనుమానాలు ఉండవనే తెలుస్తోంది.
Also Read:KCR vs BJP: జూన్ 2 ముహూర్తం.. బీజేపీపై కేసీఆర్ బయటపడుతాడా?