Mumbai Indians: ఐపీఎల్ 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విన్నర్ గా నిలిచింది.దాంతో చెన్నై ఐపీఎల్ టైటిల్ ని ఐదోసారి దక్కించుకున్న టీం గా ముంబై ఇండియన్స్ టీం పక్కన నిలిచింది.నిజానికి ముంబై ఇండియన్స్ ఎప్పుడో 2020 లోనే ఐపీఎల్ కప్ గెలిచి ఐదోసారి కప్ గెలిచినా టీం గా చరిత్రలో నిలిచింది. అప్పటికి చెన్నై మూడు సార్లు మాత్రమే కప్ కొట్టింది ఇక ఆ తరువాత చెన్నై టీం 2021 లో కప్ ఒకసారి కొట్టింది, ఇక 2023 లో మరో సారి కప్ కొట్టి వాళ్ల సత్తా ఏంటి అనేది మరో సారి ప్రూవ్ చేసుకున్నారు. నిజానికి ఐపీఎల్ లో ఎక్కువ మంది ఇష్టపడే టీముల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీం లు రెండు కూడా టాప్ పొజిషన్ లో ఉంటాయి.అయితే ఈ సారి ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ లో చెన్నై బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగితే ముంబై బ్రాండ్ వాల్యూ మాత్రం తగ్గింది. అయితే దీనికి రీజన్ గడిచిన మూడు సీజన్లలో ముంబై ఒక్కసారి కూడా కప్ కొట్టకపోవడమే దీనికి ప్రధానమైన కారణం అని తెలుస్తుంది…
ఇక ముంబై టీం మేనేజ్ మెంట్ దీన్ని దృష్టి లో పెట్టుకొని 2024 ఎలాగైనా కప్ కొట్టాలి అని అనుకొని ఇప్పటి నుంచే టీం లో భారీ మార్పులు చేస్తున్నట్టు గా తెలుస్తుంది…నిజానికి ఈ టీం లో చాలా మంచి టాప్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వీళ్లు మాత్రం కప్ కొట్టడం లో చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యం గా ముంబై ఇండియన్స్ నుంచి ఎప్పుడైతే హార్దిక్ పాండ్య వెళ్లిపోయాడో అప్పటి నుంచి ఆయన ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేకపోతున్నారు…ఆయన చివర్లో భారీ సిక్స్ లు కొట్టి టీం ని చాలా మ్యాచుల్లో గెలిపించాడు…ఇక ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ మరో హిట్టర్ అయిన పోలార్డ్ కూడా రిటైర్ అయి పోయాడు. దానితో ముంబై టీం ఈ సీజన్ లో మొదటి 7 మ్యాచుల వరకు కూడా చాలా తడబడుతూ ఆడారు,అయిన కూడా ఆ తర్వాత ఆడిన మ్యాచుల్లో వరుసగా విజయాలు సాధించి ముంబై ఇండియన్స్ టీం ప్లే ఆఫ్ దాక వెళ్ళింది. కానీ అక్కడ రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో ఓడిపోయి ఇంటి బాట పట్టారు…
అయితే మళ్లీ ఇది రిపీట్ అవ్వద్దు అంటే ఏం చేయాలి అని టీం మేనేజ్మెంట్ ఇప్పటి నుండే చాలా జాగ్రత్త పడుతున్నట్టు గా తెలుస్తుంది…ఇక అందులో భాగంగానే టీం లో ఉన్న కొందరు ప్లేయర్లను ఈ ఇయర్ జరిగే మినీ ఆక్షన్ లోకి రిలీజ్ చేసి కొంత మంది ప్లేయర్లని అయితే తీసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…
అయితే అందులో క్రిస్ జోర్డాన్ ని యాక్షన్ లోకి వదిలేసి మరో ఫాస్ట్ బౌలర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు గా తెలుస్తుంది…ఇక జొఫ్రా ఆర్చర్ ని కూడా ఆక్షన్ లోకి వదిలేయడం బెస్ట్ అని ముంబై టీం అనుకుంటుందట… నిజానికి ముంబై కి మిడిలాడర్ లో ఆడే ప్లేయర్ కావాలి అలాగే ఒక మంచి ఆల్ రౌండర్ కూడా కావాలి…అయితే ఈ క్రమం లోనే హైదరాబాద్ టీం ఎనిమిదిన్నర కోట్లు పెట్టి కొన్న రాహుల్ త్రిపాఠి ఈ ఇయర్ ఆయన స్థాయి మేరకు అంత గొప్ప పెర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు. దాంతో ఇక ఆయన్ని ఆక్షన్ లోకి రిలీజ్ చేద్దామా అని హైదరాబాద్ టీం చూస్తున్నట్టు గా తెలుస్తుంది…
అయితే ఆయన కనక ఆక్షన్ లోకి వస్తే ముంబై ఆ ప్లేయర్ ని తీసుకునే ప్రయత్నం లో ఉన్నట్టు గా తెలుస్తుంది…ఇలా కనక తీసుకుంటే మిడిలాడర్ చాలా వరకు స్ట్రాంగ్ అవుతుందని తెలుస్తుంది.ఇక అలాగే నెక్స్ట్ ఒక ఆల్ రౌండర్ గా పంజాబ్ టీం లో 2023 సంవత్సరం లో అత్యధిక రేటు కి అమ్ముడుపోయిన సామ్ కరణ్ తీసుకోవాలని చూస్తున్నారు.అయితే 2023 మెగా ఆక్షన్ లో పంజాబ్ చెన్నై తో పోటీ పడి మరి సామ్ కరణ్ ని 18 కోట్ల 50 లక్షలకి కొనుగోలు చేసింది…అందుకే ఈయన్ని ఈ ఇయర్ మళ్లీ రిలీజ్ చేసే ఆలోచన లో టీం ఉన్నట్టు గా తెలుస్తుంది…ఒక వేళ వీళ్ళిద్దరిని ఆయా టీం లు కనక రిలీజ్ చేస్తే టీం లో ఉన్న కొద్దీ మంది ప్లేయర్లని రిలీజ్ చేసి మరి వీళ్ళని తీసుకోవాలనే ఆలోచన లో ముంబై ఉన్నట్టు గా తెలుస్తుంది…
అయితే 2024 లో ముంబై ఇండియన్స్ టీం తరుపున ఆడే ప్లేయర్లు ఆ టీం విజయం లో కీలక పాత్ర వహించే వాళ్ళలా ఉండాలి, కానీ ఫామ్ లో లేని ప్లేయర్లు అవసరం లేదు అని ముంబై ఇండియన్స్ టీం ఇప్పటికే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టు గా తెలుస్తుంది…
అయితే ఈసారి టీం లో బుమ్రా కూడా ఉంటాడు. కాబట్టి ఆయనతో పాటు మరో విదేశీ పేస్ బౌలర్ ని కూడా తీసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…ఈసారి అయిన ఈ టీం కప్ కొడుతుందా లేదా అనేది చూడాలి…