Dhoni Retirement : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనికి మిస్టర్ కూల్ గా పేరుంది. ఎంతటి ప్రమాదకరమైన జట్టు అయినా అతడి తీరులో మార్పుండదు. సులభంగా ఆడినా విజయాలు మాత్రం దక్కించుకున్నాడు. మూడు కప్ లు అందించిన ఘనత అతడి సొంతం. దీంతో మహేంద్ర సింగ్ ధోని ఆట తీరును సహజంగానే ఇష్టపడతారు. అతడికి అభిమానులు కూడా కోకొల్లలు. మైదానంలో దిగాడంటే తన బ్యాట్ తో అలరిస్తాడు.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు సారధ్యం వహిస్తున్నాడు. కొద్ది రోజులుగా ధోని క్రికెట్ కు గుడ్ బై చెబుతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అతడి రిటైర్మెంట్ పై ననా రకాల కామెంట్లు వస్తున్నాయి. ఇదే చివరి సీజన్ అని చెబుతున్నారు. కానీ ధోని మాత్రం తన మనసులోని మాట బయట పెట్టడం లేదు. తన రిటైర్మెంట్ ఇప్పుడే కాదని తెలియజేస్తున్నాడు.
లక్నోతో జరిగిన మ్యాచ్ లో కామెంటేటర్ ధోనిని చూస్తూ ఇదే మీ చివరి సీజన్ అనుకోవచ్చా అని అడిగితే మీరు అనుకుంటున్నారు కానీ నేను కాదు అని నవ్వుతూ సమాధానం ఇవ్వడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. ధోని పై వస్తున్న రిటైర్మెంట్ కామెంట్లకు తనదైన శైలిలో జవాబు ఇవ్వడంతో ఇప్పుడే రిటైర్మెంట్ కావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ధోని నిర్ణయంపై ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ధోని రిటైర్మెంట్ పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది. ఇన్నాళ్లుగా ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారని వస్తున్న వాదనలకు ధోని సమాధానమే పెద్ద చెంపపెట్టు. చీటికి మాటికి ధోని త్వరలో రిటైర్మెంట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. దీనిపై ధోని లేదని చెప్పడంతో అందరు అతడికి సపోర్టుగా నిలుస్తున్నారు. ధోని విషయంలో ఎవరు కూడా కలగజేసుకోవద్దని సూచిస్తున్నారు.
MSD keeps everyone guessing 😉
The Lucknow crowd roars to @msdhoni's answer 🙌🏻#TATAIPL | #LSGvCSK | @msdhoni pic.twitter.com/rkdVq1H6QK
— IndianPremierLeague (@IPL) May 3, 2023