https://oktelugu.com/

MS Dhoni Kadaknath Chicks: ధోని పెంచే కడక్నాథ్ కోళ్ల కథేంటి.. ఎంతకు అమ్ముతున్నాడో తెలుసా?

MS Dhoni Kadaknath Chicks: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్నాడు. అసలే టెన్షన్ తీసుకోడు. అన్నిటికి ఆందోళన చెందడు. ఏది జరగాలంటే అదే జరుగుతుందనే ధోరణితో కూల్ గా ఉంటాడు. ఆటలో కూడా అలాగే ప్రవర్తిస్తాడు. శ్రీలంకతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ లో ధోని చూపిన తెగువ అందరికి ఆదర్శప్రాయమే. పదహారేళ్లు ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వ్యాపారం […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 9, 2022 / 06:11 PM IST
    Follow us on

    MS Dhoni Kadaknath Chicks: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్నాడు. అసలే టెన్షన్ తీసుకోడు. అన్నిటికి ఆందోళన చెందడు. ఏది జరగాలంటే అదే జరుగుతుందనే ధోరణితో కూల్ గా ఉంటాడు. ఆటలో కూడా అలాగే ప్రవర్తిస్తాడు. శ్రీలంకతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ లో ధోని చూపిన తెగువ అందరికి ఆదర్శప్రాయమే. పదహారేళ్లు ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వ్యాపారం మీద శ్రద్ధ పెట్టాడు రాంచీలో ఫాంహౌస్ నెలకొల్పి కడక్ నాథ్ కోళ్లను పెంచుతున్నాడు.

    MS Dhoni Kadaknath Chicks

    గత ఏప్రిల్ లో మధ్యప్రదేశ్ నుంచి కడక్ నాథ్ కోడిపిల్లలను సుమారు రెండువేలు తీసుకొచ్చి ఫాం హౌస్ లో వేశాడు. ఇప్పుడు అవి 800 గ్రాముల నుంచి కిలో వరకు పెరిగాయి. దీంతో వాటిని విక్రయించాలని ధోని భావిస్తున్నాడు. కానీ మార్కెట్ కు తరలించి అడ్డగోలు ధరలకు కాకుండా సరసమైన ధరలకు ప్రజలకు నేరుగా అందించేందుకు ఏర్పాట్లు చేశాడు. దీంతో వాటిని నేరుగా ప్రజలకు అందించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Venu Udugula: టాలెంటెడ్ డైరెక్టర్ కష్టాలు.. ఒక్క ప్లాప్ తోనే అప్పుల్లో మునిగిపోయాడు

    కడక్ నాథ్ కోడి పోషకాలతో కూడుకున్నది. పైగా ధర కూడా ఎక్కువే. కిలో కోడికి రూ. 800 నుంచి వెయ్యి వరకు ధర కూడా పలుకుతోంది. దీని మాంసం కూడా వెరైటీగా ఉంటుంది. కలర్ నల్లగా ఉంటుంది. దీంతో వీటి మాంసానికి విలువ ఎక్కువ. ధోని తన ఫాంహౌస్ కు వచ్చి తీసుకెళ్లే వారికే కోళ్లు అమ్మేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కడక్ నాథ్ కోళ్లంటే ఎక్కడా దొరకవు. అవి మధ్యప్రదేశ్ లో మాత్రమే దొరికే ఈ కోళ్లకు మంచి గుర్తింపు ఉంది. అందుకే వీటి మార్కెట్ కు అంతటి ప్రాధాన్యం ఏర్పడింది.

    MS Dhoni Kadaknath Chicks

    మరోవైపు ధోని తన ఫాంహౌస్ లో ఈసారి కూరగాయలు కూడా పెంచుతున్నాడు. టమోటాలతో పాటు వంకాయలు ఇతర కూరగాయలను సేంద్రియ ఎరువులతోనే పండిస్తూ ప్రజలకు ఆరోగ్యం కలిగించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ధోని వ్యాపార దృష్టితో కూడా ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కడక్ నాథ్ కోళ్లు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు గడించాలని ప్లాన్ చేస్తున్నాడు. క్రికెట్ కు దూరమైనా వ్యాపారంలో రాణించి మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నట్లు సమాచారం.

    Also Read:Actress Pragathi: ప్రగతి అందాల రచ్చ.. ఫోటోలు చూసి మతిపోతుందట !

    Tags