MS Dhoni: క్రికెట్‌లో ధోనీని చాలామంది మాస్టర్ మైండ్ అని చాలామంది అంటారు. ఎందుకంటే వ్యూహాలు పన్నడంలో ధోనీని మించిన దిట్ట లేడనే చెప్పుకోవాలి. ఇందుకు ఆయన కెరీర్‌లో అనేక సంఘటనలు ఉన్నాయి. బాగా ఆడుతున్న బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయాలంటే ఫీల్డర్లు, బౌలర్లను సమన్వయం చేస్తూ ఏ బంతికి ఔట్ చేయాలో సరిగ్గా అదే బంతికి ఔట్ చేస్తుంటాడు ధోనీ.
మొన్న ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కోహ్లీని ఇలాగే ఔట్ చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ లో మంచి ఫామ్ మీద ఉండగానే.. ధోని డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డ్ ఆధారంగా ప్లాన్ వేసి వికెట్ పడగొట్టాడు. కాగా నిన్న ముంబైతో మ్యాచ్ సందర్భంగా కూడా ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్ కీరన్ పోలార్డ్‌ను ఇలాగే ఔట్ చేశాడు ధోనీ. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పోలార్డ్ ఈగోను కూడా దెబ్బతీశాడు.
Also Read: MS Dhoni: మళ్లీ పాత ధోని.. బెస్ట్ ఫినిషర్ బయటకొచ్చాడు..
ముంబై తరఫున ఆడుతున్న పోలార్డ్ ఫుల్ ఫామ్‌లో వరుసబెట్టి సిక్సర్లు బాదుతున్నాడు. దాంతో అతని ప్రవర్తనలో కాస్త గర్వం కనిపిస్తోంది. మహీశ్ బౌలింగ్ లో అప్పటికే రెండు సిక్సర్లు బాదాడు పొలార్డ్. ఇక వరుస షాట్లతో విరుచుకుపడుతున్న అతగాడిని ఔట్ చేసేందుకు ధోని మాస్టర్ ప్లాన్ వేశాడు. గ్రౌండ్ లోని లాంగాఫ్ లో ఫీల్డర్లు ఎంత మంది ఉన్నా సరే.. మిడ్ వికెట్ స్ట్రయిట్ గా సూపర్ ఫీల్డర్ శివమ్ దూబే అక్కడ సెట్ చేశాడు.
మిడ్ వికెట్ మీదుగా నేరుగా ఫీల్డర్ ఉన్నా సరే.. ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోయి పోలార్డ్ అతని మీదుగా సిక్సర్ బాదేందుకు ప్రయత్నించాడు. అంటే నువ్వు ఎంతమంది గొప్ప ఫీల్డర్లను పెట్టినాసరే.. నా ముందు అవేమీ పనిచేయవని చెబుతున్నాడన్నమాట. కానీ అతని ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయలేదు. నేరుగా బంతి వెళ్లి ఫీల్డర్ చేతిలో చిక్కింది. ఇంకేముంది పొలార్డ్ ఔట్ అయిపోయాడు.
ధోనీ ఇలా పోలార్డ్‌ను ఔట్ చేసి వెనక్కు పంపడం ఇదేమీ కొత్త కాదు. గతంలో ఇలాంటివి చాలానే చేశాడు. ఎంతో మంది సూపర్ బ్యాట్స్ మెన్లను కూడా తన ప్లాన్లతో దెబ్బ కొట్టగల దిట్టగా ధోనీకి పేరుంది. ప్రస్తుతం పోలార్డ్‌ను ఔట్ చేసిన తీరును చూసిన ఫ్యాన్స్.. ధోనీ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read:Sudheer: సుధీర్ తండ్రికి అలా జరిగిందా.. డబ్బుల్లేక అలా చేసేవారా.. ఆయన కన్నీటి కష్టాలివే!
Recommended Videos: