WPL 2023 Delhi Vs Bengaluru
WPL 2023 Delhi Vs Bengaluru: మహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్లో బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.. 60 పరుగుల తేడాతో స్మృతి సేనను నోరిస్ ఒంటి చేత్తో ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఆద్యంతం అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు షేఫాలీ వర్మ (84), మెగ్ లానింగ్ (72) పరుగులు చేసి ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 1062 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. వీరి తర్వాత వచ్చిన జేమీమా(22 నాట్ అవుట్), కాప్(39 నాట్ అవుట్) దాటిగా బ్యాటింగ్ చేశారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది.
టార్గెట్ పెద్దగా ఉన్నప్పటికీ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభమే దక్కింది. స్మృతి (35), సోఫీ (14) దాటిగానే ఆడారు.. ఆ తర్వాత వచ్చిన ఎలీస్ (31) పర్వాలేదు అనిపించింది.. దిశా(9), రిచా(2), కనిక(0), శోభన (2) విఫలమయ్యారు.. చివరిలో మెగన్ షూట్(30 నాట్ అవుట్), హెదర్ నైట్(34) బాగా ఆడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మందానా, డివైన్ తర్వాత వీరిద్దరే మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయినప్పటికీ బెంగళూరు విజయం సాధించలేకపోయింది.
WPL 2023 Delhi Vs Bengaluru
మిడిల్ తడబడింది
భారీ లక్ష్యం ఉండడంతో బెంగళూరు జట్టు మిడిల్ ఆర్డర్ తడబడింది. భారీ షాట్లు ఆడేందుకు యత్నించిన బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరుకున్నారు. దిశా(9), రిచా(2), కనిక(0), శోభన (2) ఇలా మిడిల్ బ్యాటర్లు త్వరగా అవుట్ కావడంతో బెంగళూరు జట్టు కష్టాల్లో కూరుకుపోయింది.. ఇక బెంగళూరు బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారి మైనస్ పాయింట్లను ఢిల్లీ పేసర్ నోరీస్ క్యాష్ చేసుకుంది. ఏకంగా ఐదు వికెట్లు తీసింది..క్యాప్సీ రెండు, శిఖ ఒక వికెట్ తీశారు. దీంతో బెంగళూరు చెట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఢిల్లీ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన స్మృతి ఒకవేళ బ్యాటింగ్ తీసుకుని ఉంటే బెంగళూరు పరిస్థితి మరో విధంగా ఉండేది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించినా బెంగళూరు గెలిచి ఉండేది.